Begin typing your search above and press return to search.

నిరుద్యోగుల కరువు తీర్చేలా జగన్ ప్లాన్

By:  Tupaki Desk   |   22 Nov 2019 9:03 AM GMT
నిరుద్యోగుల కరువు తీర్చేలా జగన్ ప్లాన్
X
నిరుద్యోగులకు బాసటగా నిలవడంలో ఏపీలో కొలువు దీరిన జగన్ సర్కారు కొత్త పుంతలు తొక్కిస్తోంది. మరుగునపడిన వ్యవస్థలను సెట్ రైట్ చేసి కొత్త ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి మహత్తర క్రతువుకు రెడీ అయ్యింది.

ఎంబీఏలు, ఎంసీఏలు చదివినా ఉద్యోగాలు రాని ఎంతో మంది ఉన్నారు. వారికి తగిన నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడానికి జగన్ సర్కారు రెడీ అయ్యింది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్ డీసీ) ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా 13 జిల్లాల్లో 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల ఏర్పాటుకు పూనుకుంది. నిరుద్యోగం, విద్యా, ఉద్యోగాల విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్న సీఎం జగన్ ఈ మేరకు నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇందుకోసం ఏపీ ప్రభుత్వం కూడా పలు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ట్రైనింగ్ సెంటర్లతోనూ ఎంవోయూలు కుదుర్చుకుంది. వీరికి శిక్షణ ఇప్పి ఉద్యోగావకాశాలు కల్పించేలా అవగాహన ఒప్పందాలు చేసుకుంది.

ఏపీ వ్యాప్తంగా దాదాపు 39 కేంద్రాలు ఏర్పాటు చేయడానికి జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. అంటే సగటున జిల్లాకు 3 చొప్పున ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా విద్యార్థులు చదివే ప్రభుత్వ కళాశాలల్లోనే వీటిని ఏర్పాటు చేసి విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 51 రకాల స్కిల్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగాల కల్పన కూడా ప్రభుత్వం బాధ్యతనే.. ఇలా ఏపీలోని విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడానికి జగన్ సర్కారు మహత్తర గొప్ప ప్రయత్నానికి నాంది పలుకుతోంది.