Begin typing your search above and press return to search.

వంశీకి రాజ్యసభ టికెట్ ..జగన్ వ్యూహం ఇదే!

By:  Tupaki Desk   |   26 Oct 2019 5:21 AM GMT
వంశీకి రాజ్యసభ టికెట్ ..జగన్ వ్యూహం ఇదే!
X
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే టీడీపీ వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆయన రెండు రోజుల క్రితం పార్టీ అధినేత చంద్రబాబును కలిసి..తన మనసులో మాట చెప్పినట్లు సమాచారం. అదే విధంగా ఆయనకు బంధువు,బీజేపీ ఎంపీ సుజనా చౌదరితోనూ రెండు సార్లు సమావేశమయ్యారు. దీంతో..వంశీ బీజేపీలో చేరతారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత వంశీ సీఎం జగన్ తో వంశీ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం జగన్ వంశీ కి స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. సీఎం జగన్ తాను చెప్పిన సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలు చేయడం ప్రారంభించారు. ఇందులో భాగాంగనే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు.

ఎవరైన పార్టీ మారితే తన పదవికి రాజీనామా చేసి రావాలని సీఎం జగన్ నిర్ణయంతో వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ లో చేరబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ తర్వాత గన్నవరంలో ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది. కానీ , ఉప ఎన్నికలో ఆయన సీటు ఇవ్వకుండా రాజ్యసభ సీటు ఇస్తానని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం.

వంశీ పై పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ కు ఉపఎన్నికలలో ఆ సీటు ఇచ్చేందుకు జగన్ ఒప్పించినట్లుగా కూడా సమాచారం. గత ఎన్నికల్లో వంశీ పై స్వల్ప ఆధిక్యంలో ఓడిపోయిన యార్లగడ్డకు గన్నవరంలో మరోసాని పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు జగన్‌ ను నమ్ముకొని వెళ్తే వారికి న్యాయం జరుగుతుందన్న భావన కూడా వారిలో కల్పించిడానికే వంశీకి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని సమాచారం.