Begin typing your search above and press return to search.
జగన్ కూడా ఢిల్లీకి .... ?
By: Tupaki Desk | 24 Oct 2021 11:30 AM GMTఏపీ రాజకీయానికి సిసలైన వేదిక ఢిల్లీ అవుతోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారు. ఆయన టార్గెట్ వైసీపీ అన్న సంగతి తెలిసిందే. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని బాబు ఇప్పటికే డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ తోనే ఆయన కేంద్ర నాయకులను కలసి విన్నపం చేయనున్నారు. అయితే ఏపీలో రాష్ట్రపతిపాలన పెట్టడం అన్నది తేలిగ్గా జరిగే విషయం కాదని అంతా అంటున్నారు. దాంతో ఇది కాకపోయినా చాలా వరకూ ఇతర విషయాల మీద దృష్టి పెట్టి మరీ చంద్రబాబు వైసీపీని కంప్లీట్ గా బదనాం చేయడానికే హస్తిన పర్యటన చేస్తున్నారు అంటున్నారు.
చంద్రబాబు సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయనకు అటూ ఇటూ కూడా జాతీయ స్థాయి నేతలతో మంచి సంబంధాలు ఉననయి. అటువంటి బాబు ఇపుడు ఒక్కసారిగా జూలు విదిల్చారు. అదే సమయంలో ఆయన ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడుతారు అంటున్నారు. అంటే జగన్ సర్కార్ మీద నిప్ప్పులే చెరుగుతారు అన్నది అర్ధమైపోతోంది. ఏపీలో రాక్షస పాలన సాగుతోంది అని ఇంతకాలం ఆరోపించిన బాబు దానిని జాతీయ యవనిక మీద అందరికీ తెలిసేలా గట్టిగా గర్జించబోతున్నారు అంటున్నారు. చంద్రబాబు చాలా విషయాలను లిస్టౌట్ చేసుకుని మరీ ఢిల్లీకి వెళ్తున్నారు.
అందులో బీజేపీతో పొత్తులు రాజకీయ ఎత్తులు కూడా ఉన్నాయి. ఏదో విధంగా జగన్ తో బీజేపీ బంధాన్ని విడగొట్టాలన్నదే ప్రధాన అజెండా. కనీసం ఆ దిశగా అడుగులు పడుతున్నాయని లోకానికి తెలియచేసినా ఆ బంధం వీడిపోవడానికి బీటలు వారడానికి అట్టే టైమ్ పట్టదు, ఇదే బాబు మాస్టర్ ప్లాన్. మరి టీడీపీ అధినేత ఇలా దూకుడు చేస్తూంటే జగన్ చూస్తూ ఊరుకుంటారా అన్నదే ఇక్కడ చర్చ. కచ్చితంగా జగన్ దీనికి కౌంటర్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారు అంటున్నారు. జగన్ కూడా బాబు ఢిల్లీ టూర్ మీద పూర్తి దృష్టి పెట్టారు అంటున్నారు. ఆయన తన ఎంపీలను ఇప్పటికే అక్కడ అలెర్ట్ చేసి ఉంచారని చెబుతున్నారు. అలాగే కేంద్ర పెద్దలతో ఉన్న పరిచయాలతో ఎప్పటికపుడు సమాచారం తెప్పించుకుంటున్నారు అని చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ కూడా త్వరలోనే ఢిల్లీకి వెళ్తారు అన్న ప్రచారం తాజాగా వినిపిస్తోంది.
జగన్ ఈ నెల 28న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో ప్రధానంగా ఈ విషయాలే చర్చకు వస్తాయని అంటున్నారు. ఆ మీదట అవసరం అనుకుంటే జగన్ కూడా ఢిల్లీ టూర్ కి వెళ్లి కేంద్ర పెద్దల మనోగతాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ఒక వేళ బాబు ఢిల్లీ టూర్ తరువాత అనూహ్య పరిణామాలు జరిగితే కచ్చితంగా జగన్ టూర్ కూడా ఉంటుంది అంటున్నారు. ఇలా పోటా పోటీగా బాబు జగన్ ఢిల్లీ పర్యటనల మీద రచ్చ మాత్రం ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది.