Begin typing your search above and press return to search.

కోడ్ కూసింది: జగన్ కు షాక్ తగిలింది!

By:  Tupaki Desk   |   26 Jan 2021 1:45 PM GMT
కోడ్ కూసింది: జగన్ కు షాక్ తగిలింది!
X
ఏపీలో పంచాయితీ ఎన్నికలను అడ్డుకునేందుకు చివరిదాకా పోరాడిన ఏపీ సీఎం జగన్ సుప్రీం తీర్పుతో తప్పక నిర్వహించాల్సిన పరిస్థితిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఇష్టం లేకున్నా కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రూల్స్ ను అమలుచేయాల్సిన పరిస్థితిలో పడ్డారు.

ఏపీలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ పథకాన్ని ఘనంగా ప్రారంభించాలని.. వేల వాహనాలను సిద్ధం చేసి రౌండ్ కొట్టించిన సీఎం జగన్ కు ఇప్పుడు పంచాయితీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో షాక్ తగిలింది. కోడ్ నేపథ్యంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ ప్రారంభోత్సవం కూడా రద్దు అయ్యింది.ఫిబ్రవరి 1న అనంతపురం జిల్లా కదిరిలో సీఎం జగన్ పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రభుత్వ లక్ష్యానికి ఎన్నికల కోడ్ తో చెక్ పడినట్టైంది.

ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల డోర్ డెలివరీ చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. ఏడాది నుంచి వాయిదా పడుతున్న ఈ కార్యక్రమానికి ఈసారి కూడా కోడ్ అడ్డంకిగా మారింది.రేషన్ కార్డుల మంజూరులో ఆలస్యం, కరోనా లాక్ డౌన్, కొత్త కార్డుల మంజూరుతో ఇన్నాళ్లు ఆలస్యమైన ఈ పథకం తీరా ప్రారంభించే వేళ ఎన్నికల కోడ్ వల్ల అర్థాంతరంగా వాయిదా పడడం గమనార్హం.

ఇప్పటికే ఏపీ సర్కార్ ఏకంగా 9260 వాహనాలను కొని ఈనెల 21న ప్రారంభించింది. ఈ వాహనాలను ఎస్సీ, బీసీ, ఈబీసీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు ప్రభుత్వం కేటాయించింది. లబ్ధిదారులకు 30శాతం సబ్సిడీ, 60శాతం బ్యాంకు రుణం, 10శాతం లబ్ధిదారుడి వాటాతో వాహనాలు అందించింది. తీరా అమలు చేసే వేళ కోడ్ తో వాయిదా పడింది.