Begin typing your search above and press return to search.
జగన్ యాత్ర..2 రోజుల్లోనే 21.8 కిలోమీటర్లు పూర్తి
By: Tupaki Desk | 8 Nov 2017 4:36 AM GMTవైసీపీ అధినేత - ఏపీ విపక్ష నేత జగన్ సంచలనంగా ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ఇసకేస్తే రాలనంతగా జనాలు వస్తున్నారు. కొన్ని జగన్ యాంటీ పత్రికలు సైతం.. జనసమూహంతో ఉన్న ఫొటోలను ప్రచురించక తప్పని పరిస్థితి ఉందంటే.. జనాలు ఏ రేంజ్ లో వస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక, జగన్ సోమవారం ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర మంగళవారం నాటికి రెండు రోజులు పూర్తి చేసుకుంది. ఈ రెండు రోజుల్లో మొత్తం 21.8 కిలోమీటర్ల దూరాన్ని జగన్ అలవోకగా నడవడం విశేషం. తొలిరోజు 8.9 కిలోమీటర్లు యాత్ర చేసిన ఆయన మంగళవారం 12.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
మంగళవారం ఉదయం ఇడుపులపాయ వేంపల్లి రోడ్డు వద్ద రెండోరోజు పాదయాత్రను జగన్ ప్రారంభించారు. పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తూ.. మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో జగన్.. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ.. వారి కష్టాలను అడిగి తెలుసుకుంటూ ఓపిగ్గా ముందుకు సాగారు. తనకోసం తరలివచ్చిన ప్రతి ఒక్కరినీ పలకరించాకే ముందడుగు వేశారు. మధ్యాహ్న భోజన విరామం దాటిపోయినా.. జనం కోసం జగన్ యాత్రను కొనసాగించారు. శ్రీనివాస కళ్యాణ మండపంలో రచ్చబండ నిర్వహించారు.
ఈ సందర్భంగా వృద్ధులు - విద్యార్థులు - యువత తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. అనంతరం వైఎస్ జగన్ పత్తిచేలను పరిశీలించారు. నేరుగా రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా వేంపల్లి పట్టణంలో ఏడున్నర గంటలపాటు యాత్ర చేపట్టిన జగన్.. పులివెందుల దాటి కమలాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఓబుల్ రెడ్డిపల్లి జంక్షన్ దాటుకుని నేలతిమ్మాయపల్లి గ్రామ సమీపంలో 2వ రోజు పాదయాత్రను ముగించారు. బుధవారం మూడోరోజు 16.2 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు. నీలితిమ్మయపల్లి నుంచి వీఎన్ పల్లి - సంగాలపల్లి - గంగిరెడ్డిపల్లి - అయ్యవారిపల్లి మీదగా ఉరుటూరు వరకూ యాత్ర చేయనున్నారు.