Begin typing your search above and press return to search.
పాత గాయాలు తోడి రెచ్చగొడుతున్న జగన్
By: Tupaki Desk | 1 Feb 2016 10:21 AM GMT అసలే కాపులు కోపంగా ఉన్నారు.. తప్పు వారిదైనా, ఇంకెవరిదైనా కానీ కాపు గర్జన సందర్భంగానే తుని రణరంగంగా మారింది. అలాంటి సందర్భంలో సర్దిచెప్పాల్సిన బాధ్యత ముఖ్య నాయకులపై ఉంటుంది.. కానీ, ప్రతిపక్ష నేత జగన్ మాత్రం ఇది చాలదు అన్నట్లుగా పాతగాయాలను రేపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో రంగా హత్య విషయాన్ని కాపులకు మరోసారి గుర్తుచేసి అందుకు కారకులంటూ స్పీకర్ కోడెల - మంత్రి దేవినేని - పలువురు ఇతర టీడీపీ నాయకులపై ఆరోపణలు చేశారు. హరిరామజోగయ్య పుస్తకంలో ఇవన్నీ ఉన్నాయంటూ ఆయన్ను కూడా ఇందులోకి లాగారు.
తుని ఘటన వెనుక వైసీపీ ఉందన్న అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలో జగన్ తన బాణాలన్నీ టీడీపీపై ఎక్కుపెట్టారు. అందరినీ మోసం చేస్తున్న చంద్రబాబు నంబర్ 1 క్రిమినల్ అంటూ విమర్శలకు దిగారు. కాపులకు రిజర్వేషన్ అమలుచేయడం సాధ్యం కాదని తెలిసి, రిజర్వేషన్ శాతం 50కి మించకూడదని తెలిసి కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని ఎలా ఎన్నికల హామీ ఇచ్చావు? అంటూ నిలదీశారు. కాపులకు, బీసీలకు మధ్య చిచ్చుపెట్టడానికే ఈ హామీ ఇచ్చాడని అన్నాడు. గతంలో మాల, మాదిగల మధ్య కూడా ఇలాంటి చిచ్చేపెట్టాడని, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య, మనుషులమధ్య చిచ్చుపెట్టి అధికారంలో కొనసాగడమే చంద్రబాబు నైజం అని మండిపడ్డారు.
తమిళనాడు తరహాలో అసెంబ్లీలో తీర్మానం చేసి రిజర్వేషన్ల శాతాన్ని 69కి పెంచి కేంద్రంచేత అమోదముద్ర వేయించుకోవాలని, ఆవిధంగా కాపుల, బీసీల మధ్య రిజర్వేషన్ సమస్యను పరిష్కరించుకోవాలని చంద్రబాబుకు జగన్ సలహా ఇచ్చారు. అయితే... రిజర్వేషన్ల శాతం పెంచితే జనరల్ కోటాలో ఉన్నవారి గతేం కావాలన్నది మాత్రం జగన్ చెప్పలేదు. రిజర్వేషన్ల శాతం పెంచాలన్న జగన్ మాటలతో అగ్రవర్ణాలన్నీ మండిపడుతున్నాయి.