Begin typing your search above and press return to search.
మహా సంకల్పానికి జగన్ నాంది
By: Tupaki Desk | 19 Oct 2019 11:45 AM GMTమహా సంకల్పానికి జగన్ నాంది గోదావరికి వరద ఉధృతి ఎక్కువ. వందల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రం పాలు అవుతున్నాయి. ప్రతీ ఏటా వానాకాలంలో ఇదే కథ.. పోలవరం పూర్తికాకపోవడం.. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోకపోవడం జరుగుతూనే ఉంది. నీరంతా వృథాగా పోతుండగా.. కిందనున్న రాయలసీమకు మాత్రం నీటి కష్టాలు దాపురిస్తున్నాయి.
అందుకే గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. కృష్ణా, పెన్నా పరివాహక ప్రాంతాల దాహార్తి తీర్చడానికి గోదావరి జలాలను వినియోగించాలని సంకల్పించారు.
ఇందులో భాగంగా డిసెంబర్ 26న గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి చేపట్టే ప్రాజెక్ట్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆలోగా ప్రాజెక్ట్ సమగ్ర నివేదికను రూపొందించి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మూడు పెద్ద నదుల అనుసంధానంతో ఏపీ కరువు తీరుతుందని సీఎం జగన్ ఈ మహా సంకల్పానికి తెరతీశారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి వరద జలాలను రోజుకు కనీసం నాలుగు టీఎంసీల చొప్పున కృష్ణా , పెన్నా పరివాహక ప్రాంతాలకు తరలించి మూడు నదుల అనుసంధానం పనులు చేపట్టాలని సీఎం సంకల్పించారు. ఇందుకోసం వాప్కోస్ కు డీపీఆర్ సిద్ధం చేయాల్సిందిగా రూ.8.59 కోట్లు కేటాయించారు. అక్టోబర్ లో నివేదిక సిద్ధం చేసి నవంబర్ 15నాటికి పనులు చేపట్టేలా అన్ని సిద్ధం చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 15నాటికి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలన్నారు. డిసెంబర్ 26న జగన్ ఈ మూడునదుల అనుసంధాన మహా క్రతువు పనులను ప్రారంభిస్తారు.