Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ నోట భారీ హామీ.. బాబుకు షాకే!

By:  Tupaki Desk   |   2 May 2018 5:00 AM GMT
జ‌గ‌న్ నోట భారీ హామీ.. బాబుకు షాకే!
X
ప్ర‌భుత్వ సాయం అంటే ఎలా ఉండాలి? పేద‌వాడిని ఆదుకోవ‌టం అంటే.. ఎంగిలి మెతుకుల్ని విద‌ల్చ‌ట‌మా? పేదోడ్ని ఎప్ప‌టికి పేదోడిగా ఉంచేయ‌ట‌మా? లేదంటే.. త‌మ నిర్ణ‌యాల‌తో వారి బ‌తుకుల్ని మొత్తంగా మార్చేయ‌టమా? అన్న ప్ర‌శ్న‌ను సంధిస్తే.. పేదోడి బ‌తుకును మార్చాల‌న్న చిత్త‌శుద్ధి నిజంగా ఉంటే వారికి చేయాల్సిన సాయంలో ఉదారంగా ఉండాలి. ఆంక్ష‌ల్ని విధించ‌కుండా.. తీసుకునే నిర్ణ‌యంతోనే వారి బ‌తుకులు బాగుప‌డ‌తాయి.

సాయం చేసేందుకు పీనాసిగా వ్య‌వ‌హ‌రిస్తూ.. లెక్క‌ల చిక్కుల్ని వేసే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు షాక్ త‌గిలేలా భారీ హామీని ఇచ్చేశారు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

పేదోడి సొంతింటిక‌ల‌ను వ్యాపారం మాదిరి చంద్ర‌బాబు మార్చేశారంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన జ‌గ‌న్‌.. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక సొంతింటిక‌ల‌ను ఎలా తీరుస్తామో వివ‌రంగా చెప్పుకొచ్చారు. బాబుకు.. త‌న‌కు మ‌ధ్య హామీల విష‌యంలో ఎంత అంత‌రం ఉంటుంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. బాబు చెబుతున్న ఇంటి హామీని.. తాను ఇస్తున్న హామీని జ‌గ‌న్ మాట‌ల్లో వింటే.. ఇద్ద‌రి మ‌ధ్య తేడా ఏమిట‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో నిర్వ‌హిస్తున్న పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ఇచ్చిన తాజా హామీ గేమ్ ఛేంజ‌ర్ గా చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే చేసే ప‌నుల‌కు సంబంధించి ఇస్తున్న హామీల్లోనే కీల‌కంగా సొంతింటి హామీ నిలుస్తుంద‌ని చెబుతున్నారు. ఇంత‌కీ జ‌గ‌న్ ఇచ్చిన హామీని చూస్తే..

"నాన్నగారి హయాంలో ప్రతి పేద వాడికీ ఇల్లు వచ్చే పరిస్థితి ఉండేది. ఈ నాలుగేళ్లుగా చంద్రబాబు ఒక్క ఇల్లు అయినా కట్టాడా? కొత్తగా వచ్చిన బెల్‌ కంపెనీని ఇక్కడి నుంచి మార్చేసి ఆ స్థలాన్ని చంద్రబాబు ప్రభుత్వం పెద్ద కుంభకోణంగా చేయబోతోంది. ఆ స్థలంలో పేదవారికి ఇళ్లు కట్టిస్తామని చెప్పి కొత్త కథ చెబుతున్నారు. ఒక్కొక్కరికి 300 అడుగుల ఫ్లాటును అడుగుకు రూ.2 వేలు చొప్పున రూ.6లక్షలకు పేద‌వారికి అమ్ముతారట. లిఫ్టు - గ్రానైట్ - మార్బుల్‌ ఫ్లోరింగ్‌ లేని భవనంలో చెక్క సామగ్రి ఏమీ లేకుండా అడుగు ధర ఎంత ఉంటుందని ఏ బిల్డర్‌ ను అడిగినా రూ.1000 మించదని చెబుతున్నారు. ఆ ప్రకారం రూ.3 లక్షలకే ఫ్లాటు మీ చేతికి రావాలి. కానీ చంద్రబాబు అడుగు 2 వేలు చొప్పున 300 అడుగుల ఫ్లాటును రూ.6 లక్షలకు అమ్మే కార్యక్రమం చేస్తున్నాడు"

"ఈ ఆరు లక్షల్లో 1.5 లక్షలు కేంద్రం - 1.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇదీ బాగానే ఉంది. ఇక మిగిలిన రూ 3 లక్షలు ఆ పేదవాడి తరఫున అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు 20 ఏళ్ల పాటు నెలకు రూ.3 వేలు చొప్పున బ్యాంకులకు చెల్లించాలట. లంచాలు చంద్రబాబు తింటే.. పేదవాడు మాత్రం నెల నెలా రూ.3 వేలు బ్యాంకులకు కట్టుకుంటూ పోవాలట. ఇదెంత దారుణం?"

"రేపు మనందరి ప్రభుత్వం రాగానే ప్రతి పేదవాడికీ రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు కట్టిస్తాను. ఆ ఇంటిని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్టర్‌ కూడా చేసిస్తాం. ఎపుడైనా డబ్బు అవసరమైతే ఆ ఇంటిని కుదువ పెట్టి పావలా వడ్డీకే రుణం వచ్చేలా చేస్తాం" అంటూ భారీ హామీ ఇచ్చేశారు. అంతేకాదు.. మ‌రికొన్ని కీల‌క హామీల్ని వెల్ల‌డించారు.

జ‌గ‌న్ ఇచ్చిన కీల‌క హామీలు చూస్తే..

+ కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా నిర్ణ‌యం

+ ఇందుకు సంబంధించి అసెంబ్లీ మొదటి సమావేశంలోనే చట్టం తెస్తాం.

+ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తాం.

+ రాష్ట్రం విడిపోయినప్పుడు 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లెక్కలు కట్టారు. నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వ‌లేదు. మ‌న ప్ర‌భుత్వం అధకారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం.

+ ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న 10 మంది నిరుద్యోగులకు అందులో ఉద్యోగాలు ఇచ్చి గ్రామ పాలన కొనసాగిస్తాం.

+ ఒక్కో గ్రామ సచివాలయంలో స్థానికంగా ఉన్న వారికి 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అవుతుంది.

+ కులం - మతం - పార్టీలు చూడకుండా అర్హులైన వారు పెన్షన్ - రేషన్‌ కార్డు - మరుగుదొడ్లు - ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటాం.