Begin typing your search above and press return to search.

జ‌గ‌న‌న్న‌ ఉన్నాడు జాగ్ర‌త్త‌

By:  Tupaki Desk   |   13 Dec 2021 7:48 AM GMT
జ‌గ‌న‌న్న‌ ఉన్నాడు జాగ్ర‌త్త‌
X
సాధార‌ణంగా ర‌హ‌దారుల‌ పై ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపు ఉంది జాగ్ర‌త్త‌.. ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉంది జాగ్ర‌త్త‌.. ఒక‌ వేళ రోడ్డు బాగోలేక‌ పోతే గుంతులున్నాయి జాగ్ర‌త్త అనే బోర్డులు క‌నిపిస్తాయి. ప్ర‌యాణికుల ర‌క్ష‌ణ కోసం ప్ర‌భుత్వం ఈ బోర్డులు ఏర్పాటు చేయిస్తుంది. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో మాత్రం ప‌రిస్థితి భిన్నం గా ఉంది.

జ‌గ‌నన్న ఉన్నాడు జాగ్ర‌త్త అంటూ ప్ర‌జ‌లే బోర్డులు ఏర్పాటు చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. తాజాగా ఇలాంటి ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఓ పాడై పోయిన రోడ్డు పై క‌ట్టిన ఓ ఫ్లెక్సీ బోర్డు లో "జ‌గ‌న్ అన్న ఉన్నాడు జాగ్ర‌త్త‌.. ఈ బోర్డు రోడ్డు వేసే వ‌ర‌కు ఎవ‌రైన తొలిగించిన‌చో వారి వారి కుటుంబం ఆ రోడ్ల‌ పైనే పోతారు" అని ఉంది.

ఇప్ప‌టికే ఏపీ లో రోడ్ల దుస్థితిపై సీఎం జ‌గ‌న్‌ను జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. ఇక కొన్ని చోట్ల స్వ‌యంగా ప‌వ‌న్‌.. మ‌రికొన్ని చోట్ల జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు శ్ర‌మ‌దానం చేసి రోడ్లు బాగు చేస్తున్నారు. ఈ ప‌రిస్థితికి జ‌గన్ ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే కార‌ణమంటూ ప్ర‌తిప‌క్షాలు మండి ప‌డుతున్నాయి.

అయినా ప‌రిస్థితిల్లో మార్పు రాక‌పోవ‌డం తో ఆ పార్టీలు మ‌రో అడుగు ముందుకు వేసిన‌ట్లు క‌నిపిస్తోంది. రోడ్ల పాడై పోయిన చోట ఇలా జ‌గ‌నన్న ఉన్నాడు జాగ్ర‌త్త పేరుతో ఫ్లెక్సీలు క‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. తూర్పుగోదావ‌రి జిల్లా సామ‌ర్ల‌కోట‌, వేమ‌గిరి కెనాల్ రోడ్డు అన‌ప‌ర్తి శివారులో ఇలా బోర్డులు పెట్టిన‌ట్లు తెలిసింది.

రోడ్ల దుస్థితి పై విప‌క్షాలు నిర‌స‌న‌లు చేస్తుండ‌డంతో ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలోని 46 వేల కిలోమీట‌ర్ల‌ రోడ్ల మ‌ర‌మ్మ‌తులు ప్రారంభించాల‌ని అందు కోసం రూ.2,200 కోట్లు కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఏ జిల్లాలోనూ ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌తులు మొద‌లు పెట్ట‌లేద‌ని స‌మాచారం.

దీంతో టీడీపీ సానుభూతి ప‌రులు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తూ ఇలా బోర్డులు పెడుతున్న‌ట్లు స‌మాచారం. వెంట‌నే పోలీసులు ఈ ఫ్లెక్సీల‌ను తొల‌గిస్తున్నారు. వీటిని పెట్టిన వాళ్ల‌ను గుర్తించి వెంట‌నే అరెస్టు చేయాల‌ని పోలీసుల‌కు ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి ఆదేశాలు వ‌చ్చిన‌ట్లు తెలిసింది.