Begin typing your search above and press return to search.
బెజవాడ పాలిటిక్స్.. ఒకే జగన్ దెబ్బకు రెండు పిట్టలు
By: Tupaki Desk | 21 Nov 2019 7:53 AM GMTఏపీ రాజధాని ప్రాంతానికి బెజవాడ కీలకం.. ఇంట గెలిచి రచ్చ గెలిస్తేనే సంబరం.. కానీ బెజవాడలో మాత్రం వైసీపీకి పట్టు లేకుండా పోయింది. రాజధానికి కేంద్రమైన బెజవాడలో పట్టు నిలుపుకునేందుకు జగన్ మాస్టర్ స్కెచ్ వేశారు. బెజవాడ తూర్పు కోసం పట్టుబట్టి దక్కక వేరే నియోజకవర్గానికి మారి ఓడిపోయిన బలమైన నేత దేవినేని అవినాష్ కు గాలం వేశారు.అది వర్కవుట్ అయ్యింది.. దేవినేని వైసీపీలో చేరారు. అవినాష్ కు వెంటనే సీఎం జగన్ ‘బెజవాడ తూర్పు’ నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టారు..
విశేషం ఏంటంటే.. తనకు ఇదే నియోజకవర్గం టికెట్ కావాలని అవినాష్ టీడీపీలో ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను గుడివాడలో పోటీచేయించి ఓడిపోయేలా చేశారు. వైసీపీ నుంచి బెజవాడ తూర్పునియోజకవర్గం ఇస్తామని ప్రతిపాదన రాగానే అవినాష్ మరో ఆలోచన లేకుండా వైసీపీలో చేరిపోయారు.
అవినాష్ కు ఇప్పుడు జగన్ పెద్ద టాస్కే ఇచ్చారు. బెజవాడ తూర్పు నియోజకవర్గాన్ని అప్పగించి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బెజవాడలో గెలుపు బాధ్యతను ఆయన భూజాన వేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా బెజవాడలో మాత్రం వైసీపీకి ఎదురొడ్డి నిలిచి బెజవాడ తూర్పు ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గెలిచారు. ప్రజా నాయకుడిగా.. ప్రజల్లో మనిషిగా ఉండే ఆయనపై పోటీచేసిన వైసీపీ అభ్యర్థి భవ కుమార్ ఓడిపోయారు. భవకుమార్ బలం సరిపోదని.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ నగరంలో అధికార వైసీపీ గెలవాలంటే అవినాష్ ను దించాలని వైసీపీ ప్లాన్ చేసింది. ఇప్పుడు అవినాష్ తో టీడీపీ బలమైన నేత గద్దె రామ్మోహన్ కు చెక్ పెట్టడంతోపాటు విజయవాడ కార్పొరేషన్ పై వైసీపీ జెండా ఎగురవేయడానికి జగన్ ఈ ప్లాన్ చేసినట్లు తెలిసింది.