Begin typing your search above and press return to search.
జగన్ ప్రశ్నలకు అధికార పక్షం అవాక్కయింది
By: Tupaki Desk | 31 March 2017 10:48 AM GMTమొగల్తూరు ఘటనలో ఐదు నిండు ప్రాణాలు బలైపోయిన ఘటనపై ఏపీ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంశంపై సవివరంగా మాట్లాడుతూ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. సామాన్యుల ప్రాణలంటే ప్రభుత్వానికి లెక్కే లేదని మండిపడ్డారు. అయితే జగన్ ప్రసంగానికి ప్రభుత్వం తరఫున మంత్రి అచ్చెన్నాయుడు పదే పదే అడ్డు పడ్డారు. పరిశ్రమలకు అడ్డుపడుతున్నారని, అభివృద్ధి నిరోధకుడని ఆరోపించారు.
మొగల్తూరు ఘటన మీద మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన ఆశ్చర్యకరంగా ఉందని జగన్ అన్నారు. 2014లోనే పరిశ్రమ పెట్టినప్పుడు 2016లో పీసీబీ అక్కడకు వెళ్లి పైపులైన్లు తీసేయమని చెప్పింది.. అంటే రెండేళ్ల పాటు డ్రెయిన్‌లోకి వ్యర్థాలు పంపించినట్లే కదా? అని జగన్ సూటిగా ప్రశ్నించారు. రెండేళ్లుగా ఆ పైపులు వేసి గొంతేరు డ్రెయిన్‌కు పైపుల ద్వారా కాలుష్యాన్ని నింపేయడం వల్లే పీసీబీ వాటిని తీసేయమందని ప్రభుత్వమే అంగీకరించిందని గుర్తు చేశారు. `తంలో ఈ కంపెనీని జీరో పొల్యూషన్ అన్నారు, దానికి సంబంధించి చంద్రబాబు ఏకంగా ప్రెస్ లో స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. మంత్రి ఈవాళ ఇచ్చిన ప్రకటనలో మాత్రం ఈ ఘటన జరిగిన తర్వాత ప్లేటు మార్చి ఇది ఆరంజ్ కేటగిరీలోకి వస్తుందన్నారు. కాలుష్యానికి సంబంధించి రెడ్ - ఆరంజ్ - గ్రీన్ - వైట్ అని నాలుగు విభాగాలు ఉంటాయి. మొన్నటివరకు జీరో పొల్యూషన్ అని, ఇప్పుడు ఆరంజ్ కేటగిరీ అంటున్నారంటే మీ స్టాండ్ లో తేడా కనిపిస్తోంది.ఈ మార్పులో అర్థం ఏంటి? యాజమాన్యం నిర్లక్ష్యం గురించి ప్రకటనలో ఒక్క మాట కూడా చెప్పలేదు? ప‌్రజల ప్రాణాలంటే ఎందుకీ లెక్కలేనితనం?` అని జగన్ సూటిగా ప్రశ్నించారు.
ఆనంద్ ఫుడ్స్ యాజమాన్యానికే తుందుర్రులో అనుమతి ఇచ్చారని అది మొగల్తూరు కన్నా పది రెట్ల సామర్థ్యం ఎక్కువని చెప్పిన జగన్ కాలుష్యం కూడా పదిరెట్లు ఎక్కువగా వస్తుందనే విషయం గమనించాలన్నారు. ఈ రెండేళ్లుగా ప్రజలు ఇవన్నీ చూసే తమకు ఈ పరిశ్రమ వద్దని ఆందోళన చేస్తున్నారని వివరించారు. `పరిశ్రమలు రాకూడదని ఎవరికీ లేదు.. యాజమాన్యంతో కూడా నాకు ఎలాంటి విభేదాలు లేవని, పరిశ్రమలు పెట్టాల్సిన చోట పెట్టాలి. వీటిని సముద్రతీరంలో పెడితే అందరూ ఆహ్వానిస్తారని తెలిపారు. కానీ గొంతేరు డ్రెయిన్ పక్కన పెట్టడంతోనే సమస్య` అని జగన్ అన్నారు. `అక్కడ పది వేల మంది ప్రజలు నివాసం ఉంటారు. అక్కడకు క్లీనింగ్ చేయడానికి వెళ్లిన ఐదుగురు కార్మికులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా చనిపోయారు అలాంటిది పదివేల మంది ఉండేచోట ఇలాంటి ప్రాజెక్టే పెడతామంటున్నారు.పొరపాటు ఏమైనా జరిగితే ఎన్నివేల మంది చనిపోతారో ఆలోచించాలి. ప్రైవేటు కంపెనీ.. దీనికి పైప్ లైను ఎవరు వేస్తారు?అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంది.. దానికి ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? ప్రభుత్వమే డబ్బు పెట్టేటట్లయితే కంపెనీ మీద ఎందుకంత ప్రేమ? వాళ్లే పైపులైను వేసేటట్లయితే దానికి కనీసం 40 కోట్ల ఖర్చవుతుంది. గ్రామాలలో ఎవరూ భూములు ఇవ్వరు. ఆ పైపులైన్లు ఊళ్ల మధ్య నుంచి పోతాయి.. ఎక్కడైనా లీకైతే పరిస్థితి ఏంటని భూములు ఇవ్వరు.విషవాయువులు, ప్రమాదకరమైన గ్యాస్ అన్నీ ఆ పైపులైన్ నుంచే వెళ్తాయి.. అలాంటి పైపులు వేయడానికి ఎవరైనా ఎందుకు ఒప్పుకొంటారు? గొంతేరు డ్రెయిన్‌కు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. యనమదుర్రు డ్రెయిన్ పూర్తిగా కాలుష్యం అయిపోయి, అది తాగునీటికి, సాగునీటికి కూడా పనికిరాకుండా పోయింది. గొంతేరు డ్రెయిన్ పరిస్థితి కూడా అలాగే తయారవుతుందన్న ఆందోళనలో స్థానికులు ఉన్నారు. దాని బదులు ఇదే ఫ్యాక్టరీని తీరప్రాంతంలోకి తీసుకెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా` అని జగన్ నిర్మాణాత్మక సూచనలు చేశారు.
ఐదుగురు మనుషులు చనిపోతే అదేశాఖకు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కనీసం అక్కడకు వెళ్లలేదని, ముఖ్యమంత్రి కూడా వెళ్లడానికి తీరిక లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. `అక్కడ ఐదుగురు చనిపోయినా, బస్సు ప్రమాదంలో పదిమంది మరణించినా ముఖ్యమంత్రికి కనిపించదు.. కనీసం మానవత్వం అనేది చూపించాలి` అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, జగన్ ప్రసంగం సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు మధ్యలో అడ్డుపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/