Begin typing your search above and press return to search.
జగన్..ఎస్కార్ట్ ను తొలగించిన పోలీసులు
By: Tupaki Desk | 26 Jan 2017 10:57 AM GMTవిశాఖలోని మెరీనా బీచ్ లో జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీ ఉత్కంఠగా మారింది. కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టేందుకు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నణానికి బయలుదేరిన జగన్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న సందర్భంగా పార్టీ నేతలు ఆయనను కలిశారు. కాగా..విశాఖ జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎస్కార్ట్ వాహనాలు, 23 మంది భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నా విషయాన్ని పార్టీ నేతలను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ను నెరవేర్చాలని కోరుతూ విశాఖలోని మెరీనా బీచ్ లో జరగనున్న కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలో 144వ సెక్షన్ విధించడమే కాకుండా…బీచ్ వైపుగా ఎవరినీ అనుమతించడం లేదు. ఇప్పటికే పలువురిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ విశాఖకు చేరుకున్నారు. పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకుంటారా? లేక విశాఖ విమానాశ్రయం నుంచి వెలుపలకు రాకుండా అడ్డుకుని వెనక్కు పంపిస్తారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.