Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ కు క‌త్తి చేసిన గాయం ఎంత‌టిదంటే..?

By:  Tupaki Desk   |   26 Oct 2018 5:15 AM GMT
జ‌గ‌న్ కు క‌త్తి చేసిన గాయం ఎంత‌టిదంటే..?
X
విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై క‌త్తితో దాడి చేసిన వైనం పెను సంచ‌ల‌నంగా మారింది. జ‌గ‌న్ జాగ‌రూక‌తో వ్య‌వ‌హ‌రించ‌టం.. త‌న‌పై జ‌రుగుతున్న దాడిని ప‌సిగ‌ట్టి.. ప‌క్క‌కు వంగ‌టంతో పెను ప్ర‌మాదం త‌ప్పించింద‌ని చెప్పాలి.

షార్ప్ గా ఉండే కోడి పందెల క‌త్తితో త‌న‌పై జ‌రిగిన దాడి ల‌క్ష్యం మెడ కాగా.. జ‌గ‌న్ కాస్త ప‌క్క‌కు జ‌ర‌గ‌టంతో గురి త‌ప్పి చేతికి త‌గిలింది. పైకి చిన్న గాయంలా క‌నిపించినా.. దాని ప‌దును జ‌గ‌న్ కండ‌రాల్లోకి లోతుగానే దిగింది. జ‌గ‌న్ కు వైద్యం చేసిన వైద్యులు చెబుతున్న దాని ప్ర‌కారం 3 సెంటీమీట‌ర్ల లోతుకు క‌త్తి దిగిన‌ట్లుగా వారు చెబుతున్నారు.

పైకి చూసిన‌ప్పుడు కొద్దిగా గాయ‌మైన‌ట్లుగా క‌నిపిస్తుంది. కానీ.. ఇదే మొత్తంలో మెడకు కానీ దెబ్బ త‌గ‌లి ఉండే ప్ర‌మాద తీవ్ర‌త మ‌రింత ఎక్కువ‌గా ఉండేద‌ని చెబుతున్నారు.

జ‌గ‌న్ కు త‌గిలిన గాయానికి చికిత్స చేసి.. శ‌స్త్ర‌చికిత్స చేసిన సిటీ న్యూరో సెంట‌ర్ ఆసుప‌త్రి వైద్యులు తొమ్మిది కుట్లు వేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఆయ‌న‌కు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని.. డిశ్చార్జ్ ఎప్పుడు చేసేది చెబుతామ‌న్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. క‌త్తిని ఏదైనా ర‌సాయ‌నాల‌తో క‌లిపి దాడికి పాల్ప‌డ్డారా? అన్న‌ది ఇంకా తేల‌లేదు. జ‌గ‌న్ ర‌క్త‌పు శాంపిల్స్ ను సేక‌రించిన వైద్యులు.. ప‌రీక్ష‌ల కోసం వాటిని ల్యాబ్‌ కు పంపారు.

వీటి రిపోర్ట్ శుక్ర‌వారం వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఈ రిపోర్ట్ అనంత‌రం డిశ్చార్జ్ అంశంపై వైద్యులు నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెబుతున్నారు. చూసేందుకు చిన్న క‌త్తిలా క‌నిపిస్తున్న‌ప్ప‌టికి.. దాని మొన‌ షార్ప్ గా ఉండ‌టంతో గాయం పెద్ద‌ద‌నే చెప్పాలి. జ‌గ‌న్ నిత్యం క‌ష్టించేత‌త్త్వం ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆయ‌న ఫిట్ గా ఉంటారు. ధృడంగా ఉండే జ‌గ‌న్ కే మూడు సెంటీమీట‌ర్ల లోతుకు క‌త్తి దిగిందంటే.. ఫిట్ గా లేని శ‌రీర‌మైతే గాయం తీవ్ర‌త మ‌రింత ఎక్కువ‌గా ఉండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.