Begin typing your search above and press return to search.
జగన్ కు మద్దతు ఇచ్చిన బీజేపీ
By: Tupaki Desk | 31 July 2015 10:13 AM GMTగందరగోళం ఉన్నవాళ్లకు చిన్న క్లూ కూడా పెద్ద ఆన్సర్‌తో సమానం. అలాంటిది ఏకంగా పరీక్షలో పాస్ అయ్యే అవకాశం కల్పిస్తే... అదే పరిస్థితి ఇపుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఎదురైంది. కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై పోరాడటం కాదు కదా కనీసం నోరుకూడా ఎత్తడం లేదనే అపప్రద జగన్ పై ఉన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీగా పోరాడాల్సిందిపోయిన నామ్‌కే వాస్తీగా జగన్ మిగిలిపోయారని...ఆఖరికి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని పలువురు మండిపడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి ఇంద్రజీత్ సింగ్ స్పష్టం చేశారు.
"ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాద్యం కాదు. బీహారుకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామే తప్ప, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రత్యేక హోదా విషయంలో అనుసరించాల్సిన తీరుకు సంబందించి కేంద్రం వద్ద ఎలాంటి విధానం లేదు. ఆర్థిక సంఘం సిఫారసుల తర్వాత 42% నిధులను రాష్ట్రాలకు ఇస్తున్నాం. ఆ విధంగా నిధులు కేటాయించడం వల్ల ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదు" అని కేంద్ర మంత్రి లోక్‌సభ వేదికగా స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి తాజాగా తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయడం వైఎస్ జగన్‌కు బాగా కలిసివచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రమే తామేం చేయలేమని స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో జగన్ మరింత దూకుడుగా వెళ్లవచ్చని అంచనావేస్తున్నారు. ఢిల్లీ వేదికగా జగన్ చేయనున్న దీక్షకు బీజేపీయే పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లయిందని పేర్కొంటున్నారు.