Begin typing your search above and press return to search.
ఇదెక్కడి సంప్రదాయం జగన్ బాబు..?
By: Tupaki Desk | 17 Oct 2015 8:41 AM GMTనేను డిసైడ్ చేస్తా? మీరంతా పాటించండి.. అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్. ఎవరైనా ఇంటికి వచ్చి శుభకార్యానికి పిలుస్తానని అంటే.. మనసులో ఎలా ఉన్నా.. ఇంటికి వస్తున్న వారిని వద్దనకుండా ఉండలేరు. కానీ.. తాను మిగిలిన వారి మాదిరి కానని.. అందరి కంటే భిన్నమన్న విషయాన్ని మరోసారి నిరూపించారు జగన్.
ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు తన ఇంటికి వస్తున్న ఏపీ మంత్రుల బృందాన్ని రావద్దని నిర్మోహమాటంగా తేల్చి చెప్పారు. జగన్ ను ఫోన్ లో సంప్రదించటానికి ఏపీ మంత్రులు కిందామీద పడటం.. జగన్ తో మాట్లాడటం అన్నది ఎంత కష్టమైన వ్యవహారమో మంత్రులకు అర్థమయ్యేలా చేసిన జగన్.. తాజాగా తన ఇంటికి వచ్చే వారిని సైతం రావద్దని చెప్పేయటంతో కంగుతినటం ఏపీ మంత్రుల వంతైంది.
తన ఇంటికి వచ్చేది శంకుస్థాపన ఆహ్వాన పత్రం ఇవ్వటానికే అయితే తన ఇంటికి రావాల్సిన అవసరం లేదని కరాఖండిగా చెప్పేశారట. అయినా.. ఇంటికి వచ్చి ఆహ్వాన పత్రిక ఇచ్చినంత మాత్రాన ఏమైపోతుందో.. ?అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇక.. జగన్ ను కలిసేందుకు తాము రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నామని కానీ అందుబాటులో లేరని మంత్రి కామినేని వాపోయారు. జగన్ లాంటి వ్యక్తి విపక్ష నేతగా ఉండటం మన దురదృష్టకరమని వ్యాఖ్యనిస్తున్నారు ఏపీ మంత్రులు. ఇంటికి వస్తానని ఎవరు అడిగినా వద్దనలేరని.. కానీ.. జగన్ మాత్రం అందుకు భిన్నంగా తన ఇంటికే రావొద్దని చెబుతున్నారంటూ వాపోతున్నారు. మొత్తానికి ఊహించని విధంగా వ్యవహరించిన జగన్ ఏపీ మంత్రులకు చుక్కలు చూపించారనే చెప్పాలి.