Begin typing your search above and press return to search.
జగన్ కు ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం
By: Tupaki Desk | 25 Feb 2016 1:44 PM GMTఅదేంటి... రోజు.. ఉప్పు-నిప్పులా వుండే జగన్ కు, ఏపీ ప్రభుత్వం అధినేత చంద్రబాబు ఎలా ఊరటకలిగించాడని అనుకుంటున్నారా? అవును మీరు చదివింది నిజమే. జగన్ కు ఎంతో మేలు జరిగేలా ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అది తెలుసుకోవాలంటే.. మీరు ఇది చదవాల్సిందే. ఇండియా సిమెంట్ కంపెనీ జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. ఇదే కంపెనీకి కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ వుంది. ఈ ఫ్యాక్టరీకి నీటి కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనేది సీబీఐ ఆరోపణ. ఈ సంస్థకు అక్రమంగా నీటి కేటాయింపులు చేయడం వల్లే.. ఆ కంపెనీ జంగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని సీబీఐ ఆరోపిస్తోంది. అందుకు అప్పట్లో నీటి కేటాయింపులు చేసిన ఐ.ఎ.ఎస్.అధికారులు ఆదిత్యనాథ్, శ్యామ్యూల్ లను విచారించాలని.. అందుకు కేంద్రం అనుమతి కోరింది. అయితే ఇందుకు కేంద్రం నిరాకరించింది. నీటి కేటాయింపుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్రం... సీబీఐకు స్పష్టం చేసింది. ఇలా కేంద్రం ఐ.ఎ.ఎస్.అధికారులను విచారించడానికి నిరాకరించడం వెనుక ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికే కారణం అని తెలుస్తోంది.
నీటి కేటాయింపుల విషయంలో విధానపరమైన జరిగిన తప్పు మాత్రమే. ఇందులో ఐ.ఎ.ఎస్.అధికారుల వ్యక్తిగత ప్రయోజనాలు ఏమాత్రం లేవని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. దాంతో సీబీఐ విచారణకు బ్రేక్ పడింది. సో...ఇలా ఐ.ఎ.ఎస్.అధికారులను ఏపీ ప్రభుత్వం వెనుకేసుకొని రావడంతో... పరోక్షంగా జగన్ కు మేలైంది. దాంతో ఇండియా సిమెంట్ ఎలాంటి ప్రయోజనాలు లేకుండానే జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిందని, ఇందులో ఏమాత్రం క్విడ్ ప్రోకోకు పాల్పడినట్టు ఆధారాలు లేవనేది తేటతెల్లం కావడంతో ఏపీ ప్రతిపక్షనేత జగన్ కు ఊరటనిచ్చినట్టయింది. సో.. అలా ఏపీ ఫ్రభుత్వం జగన్ కు మేలు చేసిందన్నమాట.