Begin typing your search above and press return to search.
బాబు జన్మదిన శుభాకాంక్షలకు..జగన్ రిప్లై
By: Tupaki Desk | 21 Dec 2017 2:40 PM GMTఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ వేదికగా జరిగింది. ఇందుకు ఏపీ ప్రతిపక్ష నేత - వైసీపీ అధినేత - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేదికగా నిలిచింది. సీనియర్ రాజకీయ వేత్త అయిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రత్యేకతను నిలుపుకోగా...అదే రీతిలో విపక్ష నేత వైఎస్ జగన్ తన హుందాతనాన్ని చాటుకున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే...ఏపీ ప్రతిపక్షనేత - వైసీపీ అధినేతకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు వైఎస్ జగన్. మీరు ఆరోగ్యంగా - సంతోషకరంగా ఉండేలా ఆ భగవంతుడి కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది.
మరోవైపు విపక్ష నేత జగన్ సైతం ఇదే రీతిలో హుందాగా స్పందించారు. ట్విట్టర్ ద్వారా చంద్రబాబుకు జగన్ ధన్యవాదాలు తెలిపారు. `మీ శుభాకాంక్షలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ధన్యవాదాలండి` అంటూ జగన్ ప్రతిస్పందించారు. కాగా, ట్విట్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అధికార - ప్రతిపక్షాల నేతలు శుభాకాంక్షలు - ధన్యవాదాలు తెలుపుకోవడం ఆసక్తిగా ఉంది.
కాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. పార్టీ కార్యాలయాలు ఉన్న హైదరాబాద్ తో పాటుగా విజయవాడలో కూడా నిర్వహించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమడలో బస చేయగా గురువారం ఉదయం పార్టీ నేతలు - కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. భారీ కేక్ కట్ తెప్పించి వైయస్ జగన్ చేత కట్ చేయించారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు.... ఆయన సూచించారు.