Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.180 కోట్ల బేరం
By: Tupaki Desk | 1 Sep 2015 1:06 PM GMTఓటుకు నోటు కేసు విషయమై మంగళవారం ఏపీ అసెంబ్లీలో టీడీపీ, వైకాపా నాయకుల మధ్య గట్టి వాగ్వివాదం జరిగింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రూ.180 కోట్లతో 8 మంది ఎమ్మెల్యేల కొనుగోలుకు భేరసారాలు జరిపిందని జగన్ ఆరోపించారు. ముందుగా ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడుతూ తనను ఈ కుట్రలో ఇరికించేందుకు జగన్ కేసీఆర్, తెరాస నాయకులతో లాలూచీ పడ్డారని విమర్శించారు. జగన్, తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఏ హోటళ్లో ఏం మీటింగ్ పెట్టుకున్నారో కూడా తన వద్ద డాక్యుమెంట్ ఉందన్నారు. అనంతరం కార్మిక శాఖా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్ జగన్‌కు బంధువని.జగన్ చెపితేనే ఆయనకు కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారని ..టీడీపీ, బీజేపీ కూటమి విడిపోతే బాగుంటుందని జగన్ కలలు కంటున్నారని ఆయన విమర్శించారు.
చంద్రబాబు, అచ్చెన్న మాటలకు స్పందించిన జగన్ అసలు ఆ స్టీఫెన్ సన్ ఎవడో తనకు తెలియదు..నేను హరీష్ రావు మీటింగ్ పెట్టుకున్నామని అచ్చెన్నాయుడు చెపుతున్న హోటల్ పేరు కూడా తనకు తెలియదన్నారు. ఇది నిజమైతే తాను రాజీనామా చేస్తానని..అబద్ధమైతే చంద్రబాబు రాజీనామా చేస్తాడా అని జగన్ అచ్చెన్న వైపు చూస్తూ సవాల్ విసిరాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇంకా నయ్యం రేవంత్ రెడ్డికి కూడా తానే డబ్బులు ఇచ్చి పంపానని అచ్చెన్న చెప్పలేదని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు ఇటీవల ఓటుకు కోట్లు గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారని..ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు మోడీ వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కొనడానికి టీడీపీ నాయకులు రూ.180 కోట్లు రెఢీ చేశారని...గతంలో కాంగ్రెస్, చంద్రబాబు కలిసి తనపై కేసులు పెట్టారని జగన్ విమర్శించారు.