Begin typing your search above and press return to search.

అయోధ్య తీర్పు పై స్పందించిన జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి

By:  Tupaki Desk   |   9 Nov 2019 7:01 AM GMT
అయోధ్య తీర్పు పై స్పందించిన జగన్  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి
X
అయోధ్య లో రామ మందిర నిర్మాణాని కి మార్గం సుగమమైంది.అయోధ్య వివాదాస్పద స్థలం హిందువుల దేనని సుప్రీం తీర్పు. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువుల కు అప్పగించాలని తీర్పు ఇచ్చారు. అలాగే అయోధ్య లోనే మసీదు నిర్మాణాని కి ముస్లింల కు ప్రత్యామ్నాయం గా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయోధ్య యాక్ట్‌ కింద మందిర నిర్మాణాని కి మూడు నెలల్లోగా ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ ను సైతం తోసిపుచ్చింది. నిర్మోహి అఖారాకు వారసత్వ హక్కులు క్లెయిమ్‌ చేసే హక్కు లేదని తేల్చి చెప్పింది.

అయోధ్య వివాదాస్పద స్థలం హిందువుల దేనని సుప్రీం కోర్టు తుది తీర్పును వెల్లడించిన నేపథ్యంలో ..ఈ తీర్పు పై ఏపీ సీఎం జగన్ స్పందించారు. అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరు పక్షాలూ సుప్రీం కోర్టు కు తెలియ జేసిన మీదటే ఈ విషయం లో భారత దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది అని తెలిపారు. అలాగే ఇటువంటి పరిస్థితు ల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చ గొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరు సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాను అని సీఎం జగన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.