Begin typing your search above and press return to search.
బాబు చేసిన తప్పుల లెక్క చెప్పిన జగన్
By: Tupaki Desk | 15 March 2017 5:30 PM GMTబలమైన ప్రతిపక్ష నేత ఉంటే.. అధికారపక్షం చేసే తప్పులన్ని ఇట్టే తెలిసిపోతాయ్. తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో లోపాలుఎన్ని ఉన్నా వాటిని కళ్లకు కట్టినట్లుగా చూపించినోళ్లే లేరు.కానీ.. ఏపీకి ఆ పరిస్థితి లేదు. జగన్ రూపంలో ఉన్న బలమైన ప్రతిపక్ష నేత పుణ్యమా అని.. ప్రజలు ఏ విధంగా మోసగించబడతారన్న విషయాన్నికళ్లకు కట్టినట్లుగా సాక్ష్యాలతో చెప్పేశారు. తాజాగా మీడియాతో మాట్లాడినజగన్.. ఏపీ బడ్జెట్ లో ఉన్న మాయను వివరంగా చెప్పుకొచ్చారు. ఆ వివరాల్ని చూస్తే..
‘‘ఏపీ బడ్జెట్ సమావేశాలు చూసిన తర్వాత బడ్జెట్‌లో వీళ్లు చూపిస్తున్న లెక్కలు యావత్ ఆంధ్ర రాష్ట్రం ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2016-17కు సంబంధించి 11.61 శాతం వృద్ధిరేటు నమోదు కాబోతోందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలన్నింటి అభివృద్ధితోనే మొత్తం వృద్ధిరేటు ముడిపడి ఉంటుంది. ఈ మూడు రంగాల్లో అభివృద్ధి కనిపిస్తే ముందుకెళ్లినట్లు. లేకుంటే తిరోగమనంలో ఉన్నట్లే. 2022, 2029,2050 వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన లెక్కల్ని కూడా చంద్రబాబు చూపించారు. అప్పటికి దేశంలో అత్యధికంగా వృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అయితే.. ఈమధ్యన ఐఎంఎఫ్ కొన్ని లెక్కలు విడుదల చేసింది. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సగటు జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతం అని..భారతదేశంలో వృద్ధిరేటు 7.1 శాతం ఉందని చెప్పింది. దాని ప్రకారం దేశం బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పారు. మరి.. ఆంధ్రప్రదేశ్ ఏకంగా 11.61శాతం వృద్ధిరేటు నమోదు చేసిందంటే ప్రపంచంలో ఇప్పటికే మనం నెంబర్ వన్ గా ఉన్నట్లు లెక్క కదా? అలాంటప్పుడు 2020,2029, 2050 వరకు లక్ష్యాలు పెట్టుకోవడం ఎందుకు?’’ అంటూ భారీ లాజిక్ బయటకు తీసి మరీ ప్రశ్నించారు.
జగన్ చెప్పిన లాజిక్ ను చూస్తే.. బాబు బడ్జెట్ లోని బడాయితనమంతా ఇట్టే అర్థమైపోతుంది. ఇక.. యనమల వారు చేసిన బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేక హోదా గురించి కూడా ప్రస్తావించారు. దీనిపై జగన్ వెలిబుచ్చిన సందేహాన్ని చూస్తే.. ‘‘ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం అభ్యంతరం చెప్పిందన్నారు. అందుకే దానికి సమానంగా ప్రత్యేక సాయం పొందామన్నారు. 14వ ఆర్థిక సంఘం సభ్యులు డాక్టర్ గోవింద్ రావు.. అభిజిత్ సేన్.. తదితరులు అసలు అలాంటి సిఫార్సులు ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకు, తమకు ఏమీ సంబంధం లేదన్నారు’’ అని గుర్తు చేశారు.
రాయితీలకు సంబంధించి అవార్డు తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారని.. ఏపీ డిస్కంలకు 62.7 శాతం నష్టాలు పెరిగితే ఎవరైనా అవార్డు ఇస్తారా? అని ప్రశ్నించారు. క్రిసిల్ రేటింగ్ గమనిస్తే డిస్కంలలో ఒకదానికి బి+ నుంచి బి కేటగిరీ వచ్చిందని.. మరో డిస్కంకు అలాగే రేటింగ్ ఉంది తప్ప పెరగలేదని గుర్తు చేశారు. ‘‘మరి ఇలాంటప్పుడు ఆయనకు ఐదు అవార్డులు ఎందుకు ఇస్తారు? శిథిలమైన భవనంలో చిన్న కిటికీ శుభ్రంగా ఉందని దానికి అవార్డు ఇచ్చినట్లు చంద్రబాబు చెబుతున్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు.
2017-18కి సంబంధించి చంద్రబాబు 1.56 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని.. రాష్ట్రం విడిపోక ముందు 2013-14లో చూసుకుంటే రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి ఏపీ బడ్జెట్ 1,40,742 కోట్లన్న విషయాన్ని గుర్తు చేసిన జగన్.. ‘‘తెలంగాణది.. మనది కలిపితే మూడు లక్షల కోట్లకు పైగా బడ్జెట్లు ఉన్నాయి,అంత గొప్ప పాలన సాగుతోంది, అంత గొప్పగా అంకెలు చూపుతున్నారు. నిజంగా రెవెన్యూలు అంత అద్భుతంగా ఉన్నాయా అంటే, చంద్రబాబు కోర్ డాష్ బోర్డే చూద్దాం. అందులో ప్రభుత్వ ఆదాయాలు అన్నీ కలిపి రూ.1,28,009 కోట్ల లక్ష్యం అయితే.. వచ్చింది మాత్రం 99,535 కోట్లు మాత్రమే. ప్రభుత్వ వ్యయం చూస్తే.. రూ.1,35,688 కోట్ల బడ్జెట్ కు గాను ఇప్పటివరకు రూ.1,16,812కోట్లు మాత్రమే.2016 డిసెంబర్ 31 నాటికే రూ.30,953 కోట్ల అప్పులు తెచ్చుకున్నారు. కానీ వాస్తవానికి ఎఫ్ఆర్‌బీఎం పరిమితి ప్రకారం రూ.20 వేల కోట్లకు మించి అప్పు తెచ్చుకోడానికి వీల్లేదు. ఆర్‌బీఐ నిబంధనలు ఉంటాయి కాబట్టి పెన్షనర్ల సొమ్ములను అత్తగారి సొమ్ము అన్నట్లుగా తీసేసుకుంటున్నారు. ఇది రొటీన్‌గా జరుగుతోంది.. ఇది చాలా ప్రమాదకరమైనది. నిబంధనల ప్రకారం 3 శాతానికి మించి అప్పు తీసుకోకూడదంటే 5 శాతానికి పైగా చేస్తున్నారు. ఇలా ఆర్థిక క్రమశిక్షణను పూర్తిగా ఉల్లంఘించారు’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.జగన్ మాటల్నివింటే.. బాబు లెక్కల్లోని డొల్లతనం కళ్లకు కట్టినట్లుగా కనిపించక మానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/