Begin typing your search above and press return to search.
గర్వపడుతున్నాం!.. సర్జికల్ స్ట్రైక్స్ పై జగన్ మాటిదే!
By: Tupaki Desk | 26 Feb 2019 10:38 AM GMTపుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా నేటి తెల్లవారుజామున భారత వైమానిక దళం జరిపిన సర్ఝికల్ స్ట్రైక్స్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 40 మంది భారత జవానులను బలిగొన్న జైషే మొహ్మద్ శిబిరాలే లక్ష్యంగా కొనసాగిన ఈ దాడుల్లో ఏకంగా 300 మంది ఉగ్రవాదులు మరణించారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలో ముగిసిన ఈ దాడుల్లో భారత్ సత్తా ఏమిటో... ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ వస్తున్న పాకిస్థాన్ కు ఇట్టే అర్థమైందన్న వాదన కూడా వినిపిస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత సరిహద్దు వెంట హైఅలర్ట్ అమలవుతుండగా... ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొనసాగిన ఈ దాడులపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అధికార - విపక్షాలన్న తేడా లేకుండా దాదాపుగా అన్ని పార్టీలు కూడా సర్జికల్ స్ట్రైక్స్ పై హర్షం వ్యక్తం చేస్తూ.. మోదీ సర్కారు డేరింగ్ డెసిషన్ ను - ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సామర్ధ్యాన్ని ఆకాశానకెత్తుతూ ఆయా పార్టీల నేతల నుంచి ప్రశంసలు వెల్లుతెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే నేటి ఉదయం లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా #సర్జికల్ స్ట్రైక్స్2 పేరిట ఎంట్రీ ఇచ్చిన హ్యాష్ ట్యాగ్ ద్వారా స్పందించారు. ఉగ్రవాదులను తుదముట్టిస్తూ వీరోచితంగా దాడులు జరిపిన ఐఏఎఫ్ పైలట్లకు జగన్ అభినందనలు తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్-2ను విజయవంతంగా నిర్వహించిన భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్నట్టు ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. జగన్ ట్వీట్ ఎలా సాగిందంటే... *ఉగ్రవాదులను తుదముట్టిస్తూ వీరోచితంగా దాడులు జరిపిన ఐఏఎఫ్ పైలట్లకు అభినందనలు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం* అని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.