Begin typing your search above and press return to search.

ముద్రగడ అరెస్ట్ మీద జగన్ రియాక్షన్ ఇది..

By:  Tupaki Desk   |   10 Jun 2016 7:03 AM GMT
ముద్రగడ అరెస్ట్ మీద జగన్ రియాక్షన్ ఇది..
X
కాపు నేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేయటంపై ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ముద్రగడ అరెస్ట్ ను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చనందుకే ముద్రగడ దీక్ష చేస్తున్నట్లుగా చెప్పిన ఆయన.. హామీలు అమలు చేతకాక.. ఇంట్లో కూర్చొని దీక్ష చేస్తున్న వారిపై దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ముద్రగడ అరెస్ట్ అంశంపై జగన్ ఏమన్నారంటే..

= గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్ని అమలు చేయనందుకే ముద్రగడ దీక్ష చేస్తున్నారు.

= ఇంట్లో దీక్ష చేస్తుంటే భారీగా పోలీసుల్ని పంపాల్సిన అవసరం ఏముంది?

= మాట తప్పి మోసం చేసింది చంద్రబాబు నాయుడే. హామీల అమలు కోసం ప్రశ్నిస్తే ఎదురుదాడులు చేయిస్తారా?

= హామీల అమలు చేయాలని కోరితే లా అండ్ ఆర్డర్ సమస్యగా చిత్రీకరిస్తారా?

= గతంలో కూడా చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టారు. ఇప్పుడు ఒకే కేలంలో విభేదాలు తీసుకొచ్చి ఒకరిపై మరొకరిని ఉసిగొల్పుతున్నారు.

= ముద్రగడ దీక్షను భగ్నం చేసేందుకు వందలాదిమంది పోలీసుల్ని పంపారు. తూర్పుగోదావరి జిల్లాలో సాక్షి టీవీప్రసారాల్ని నిలిపివేశారు.

= ముద్రగడ వార్తల్ని ప్రసారం చేయొద్దని అనుకూల మీడియాకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. మీడియా ప్రసారాలు నిలిపి వేయటం సరికాదు.

= గతంలో వైఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో వార్తలు మీడియాలో వచ్చాయని.. ఎప్పుడూ వైఎస్సార్ సర్కారు మీడియా జోలికి వెళ్లలేదు.

= తాజాగా చంద్రబాబు సర్కారు కొత్త సంప్రదాయానికి తెర తీసింది. నచ్చని మీడియా ప్రసారాలను ఆపివేయటం ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదు.

= నచ్చని మీడియా ప్రసారాల్ని నిలిపివేయటం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు.

= మాట ఇచ్చి తప్పింది చంద్రబాబు నాయుడే. మోసం చేసింది చంద్రబాబే. ఇలాంటి పనులు చేస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారు?

= ఎన్నికలప్పుడు అబద్ధాలు ఆడటం.. ఆ తర్వాత మాట తప్పటం అలవాటు అయ్యింది. మోసం చేస్తున్నారని అడగటం తప్పా?

= అందరూ కలిసి నిరసనలు తెలపాలి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తుని ఘటనను సీబీఐకి అప్పగించాలి.