Begin typing your search above and press return to search.
ఏం జరిగినా పాదయాత్ర ఆపేది లేదు
By: Tupaki Desk | 29 Oct 2018 10:55 AM GMTవైకాపా అధినేత వైఎస్ జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో హత్యా ప్రయత్నం జరిగిన విషయం తెల్సిందే. జగన్ కు కత్తి గాయం అవ్వడంతో వైధ్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మరో వైపు జగన్ పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో పాదయాత్రను నిలిపేసే అవకాశం ఉందని కొందరు భావించారు. టీడీపీ వారు పాదయాత్రకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే జగన్ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడంటూ రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే వైకాపా పార్టీ నాయకుల నుండి జగన్ పాదయాత్రకు సంబంధించిన ముఖ్య ప్రకటన వెలువడినది.
వైధ్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న జగన్ నవంబర్ 3వ తేదీ నుండి పాదయాత్రను తిరిగి ప్రారంభించబోతున్నట్లుగా పార్టీ నాయకులు పేర్కొన్నారు. పెద్ద ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న జగన్ ఇకపై జాగ్రత్తగా ఉండాలని - ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రత సిబ్బందితో పాటు - సొంతంగా కూడా ప్రైవేట్ భద్రతను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారట. గతంలో మాదిరిగానే ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నాడట.
జగన్ పాదయాత్రకు ఎక్కడైతే తాత్కాలిక బ్రేక్ పడినదో అక్కడ నుండే శనివారం నాడు మొదలు కాబోతుందట. వచ్చే శుక్రవారం మరోసారి వైద్య పరీక్షలు చేయించుకుని, అంతా ఓకే అనుకుంటే శనివారం నాడు పాదయాత్రను పున: ప్రారంభించాలని వైకాపా నాయకులు భావిస్తున్నారట. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా జగన్ పట్టుదలతో పాదయాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు.