Begin typing your search above and press return to search.

మే 6 నుంచి విశాఖ నుంచే జగన్ పాలన?

By:  Tupaki Desk   |   9 March 2021 4:48 PM GMT
మే 6 నుంచి విశాఖ నుంచే జగన్ పాలన?
X
'మూడు రాజధానులపై ఇంకా తేలకున్నా.. కోర్టుల్లో నలుగుతున్నా.. కేంద్రం ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకున్నా.. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నా సరే..' అప్పటివరకు ఆగేది లేదని ఏపీ సీఎం జగన్ రెడీ అయ్యారా? అంటే ఔననే అంటున్నాయి అధికార వర్గాలు.. సీఎం జగన్ మే 6కు ముహూర్తం పెట్టారని.. ఆ రోజు నుంచి విశాఖ నుంచే పాలించాలని డిసైడ్ అయ్యారని అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది.

ఏపీ సీఎం జగన్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాడని అంటున్నారు. మే 6 లోపు పిల్లల స్కూళ్లు కాలేజీలు, ఇతర సౌకర్యాలు సమకూర్చుకోవాలని.. కార్యాలయాలను సిద్ధం చేసుకొని రెడీగా ఉండాలని.. విశాఖనుంచే పాలన జరుగబోతోందని తేల్చిచెప్పినట్టు సమాచారం.

మేు 6 నుంచి ఏపీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం విశాఖలో ప్రారంభం కాబోతోందట.. ఈ మేరకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద ఈ మేరకు మూహూర్తం పెట్టారని.. జగన్ వైజాగ్కు షిఫ్ట్ కావడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

కోర్టుల్లో ఇంకా మూడు రాజధానుల విషయం తేలలేదు. అయినా కూడా అధికారులకు జగన్ దిశానిర్ధేశం చేసి ముందడుగు వేయాలని డిసైడ్ అయ్యాడట.. '"సాంకేతికంగా కోర్టులు నిర్ణయం తీసుకునే వరకు రాజధాని అమరావతిగా కొనసాగుతుంది. కానీ కోర్టులు విశాఖపట్నం నుంచి పనిచేయకుండా నన్ను ఆపలేదు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుండైనా పనిచేయవచ్చు. సిఎం ఎక్కడ నుండి పనిచేస్తున్నా, పరిపాలన కూడా అదే స్థలం నుంచి పనిచేస్తుంది, "అని న్యాయపరమైన చిక్కుల గురించి కుండబద్దలు అధికారులకు జగన్ దిశానిర్ధేశం చేసినట్టు సమాచారం.

జగన్ పట్టుదలగా ఉండడం.. మే 6 నుంచి విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని తేల్చిచెప్పడంతో ఇప్పుడు సీఎం జగన్, సచివాలయ ఉద్యోగులందరూ రెడీ అవుతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడబోతోందని ఇన్ సైడ్ టాక్.