Begin typing your search above and press return to search.

ఫీజు రీయింబర్స్‌ మెంట్ డబ్బు అమ్మ ఖాతాలోకి..సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం!

By:  Tupaki Desk   |   14 April 2020 11:10 AM GMT
ఫీజు రీయింబర్స్‌ మెంట్ డబ్బు అమ్మ ఖాతాలోకి..సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం!
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ..సంచలన నిర్ణయాలకు మారు పేరుగా నిలుస్తున్నారు. తాజాగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము డైరెక్ట్ గా కాలేజ్ లకి ట్రాన్స్ ఫర్ చేసేవారు ..కానీ , వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాలోకే ఫీజు రీయింబర్స్‌ మెంట్ మొత్తాన్ని జమ చేస్తామని తెలిపారు. త్రైమాసికానికి ఓ విడత చొప్పున రీయింబర్స్‌మెంట్ సొమ్మును తల్లుల అకౌంట్లో జమ చేయనున్నారు.

దీంతో కాలేజీ యాజమన్యాలతోపాటు విద్యార్థులకు కూడా ఊరట చేకూరే అవకాశం ఉంది. 2018-19కి సంబంధించి రూ.1800 కోట్ల బకాయిలను చెల్లించామని ప్రభుత్వం తెలిపింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించామని సీఎం తెలిపారు. తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని కాలేజీలకు సీఎం ఆదేశాలు జారీచేశారు.

జగనన్న విద్యాదీవెన పథకం కింద ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్‌ మెంట్ చేయాలని జగన్ సర్కారు గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 75 శాతం హాజరు తప్పనిసరి అనే నిబంధన విధించింది. అలాగే ఏపీలోని జగన్ సర్కారు ఇప్పటికే అమ్మ ఒడి పథకం కింద బడికెళ్లే విద్యార్థుల తల్లి ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే.