Begin typing your search above and press return to search.

స్టీల్ ప్లాంట్ మీద కమిట్ మెంట్ ప్రదర్శించిన జగన్ సర్కార్

By:  Tupaki Desk   |   20 May 2021 5:30 PM GMT
స్టీల్ ప్లాంట్ మీద కమిట్ మెంట్ ప్రదర్శించిన జగన్ సర్కార్
X
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయంపై ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావటం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఏపీలోని జగన్ సర్కారు సైతం వ్యతిరేకించింది. అంతేకాదు.. ఈ ప్లాంట్ ను లాభాల బాట పట్టించేందుకు అవసరమైన ప్లాన్ ను ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రూపంలో పంపారు సీఎం జగన్. అంతేకాదు.. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటీకరించొద్దని ఆయన ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కోరింది.

తాజాగా నిర్వహించిన ఏపీ బడ్జెట్ సమావేశం సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి.. ఆమోదించారు. ప్రైవేటీకరణకు భిన్నంగా తన లేఖ ద్వారా ఐదు ప్రత్యామ్నాయాల్ని ఇప్పటికే సీఎం జగన్ చూపించారని పేర్కొన్నారు ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

విశాఖ ఉక్కు తెలుగువారి ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని గుర్తు చేసిన ఆయన.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఏపీ అసెంబ్లీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న విషయాన్ని తాజా తీర్మానంతో స్పష్టం చేశారని చెప్పాలి. విశాఖ ఉక్కును రక్షించుకోవటం కోసం ఏ మార్గానికైనా తాము సిద్ధంగా ఉన్నట్లుగా ఇప్పటికే స్పష్టం చేసినజగన్ సర్కారు.. తాజాగా తన చేతలతో మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పాలి. మరి.. ఈ తీర్మానంపై కేంద్రం ఏ విధంగా రియాక్టు అవుతుందో చూడాలి.