Begin typing your search above and press return to search.

నీలం సాహ్ని కోసం రంగంలోకి జగన్ సర్కార్

By:  Tupaki Desk   |   1 July 2021 7:24 AM GMT
నీలం సాహ్ని కోసం రంగంలోకి జగన్ సర్కార్
X
జగన్ సర్కార్ తీసుకునే ఏ నిర్ణయమైనా సరే.. అందులో లూప్ హోల్ వెతకడం.. దానిపై కోర్టులకు ఎక్కడం.. ఈ మధ్య తరుచుగా జరుగుతోందని ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ హాట్ డిస్కషన్లు నడుస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా జగన్ సర్కార్ కు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగలడం గమనిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఈసారి పకడ్బందీగా ముందుకెళుతోంది.

ఏపీ ఎన్నికల కమిషనర్ గా మాజీ సీఎస్ నీలం సాహ్నిని జగన్ సర్కార్ నియామకం చేసింది. అయితే ఆమె అప్పటికే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆ హోదా వదులుకొని ఏపీ ఎన్నికల కమిషనర్ గా చేరారు. సాహ్నీ ఎస్ఈసీగా చేరే సమయానికి ఎలాంటి ప్రభుత్వ బాధ్యతల్లో లేరు. అయితే కొందరు దీనిపై కొందరు హైకోర్టు ఎక్కడం.. ఆమె వివిధ హోదాల్లో ఉన్నారని చెప్పడంతో సాహ్ని నియామకంపై హైకోర్టు విచారణ జరిపి ఏపీ ప్రభుత్వానికి, గవర్నర్ కు, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలోనే నీలం సాహ్ని కోసం ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రభుత్వం తరుఫున గోపాలకృష్ణ ద్వివేది కౌంటర్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషనర్ గా సాహ్ని బాధ్యతలు స్వీకరించే ముందు ఆమె ఎలాంటి ప్రభుత్వ హోదాల్లో లేరని పేర్కొన్నారు.

ఇదివరకు న్యాయశాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తిని ఏపీ ఎన్నికల కమిషనర్ గా నియమించడంతో అది రద్దు అయిపోయింది. ఇప్పుడు నీలం సాహ్ని విషయంలో ఏపీ ప్రభుత్వానికి అలాంటి సమస్యనే ఎదురైంది. మరి దీన్ని ఆమె , ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తిగా మారింది.

ప్రభుత్వ హోదాల్లో ఉన్న వారు రాజ్యాంగ పదవుల్లో కొనసాగరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకునే ఇప్పుడు నీలం సాహ్ని పదవికి ఎసరు తెచ్చేలా పలువురు చక్రం తిప్పారు. ఈ వ్యవహారంలో కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.