Begin typing your search above and press return to search.
యువతకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్ తో డీల్
By: Tupaki Desk | 14 April 2021 2:43 AM GMTఏపీలోని యువతకు ఉపాధి కల్పించేందుకు జగన్ సర్కార్ రెడీ అయ్యింది. యువతకు ఉగాది సందర్భంగా శుభవార్త చెప్పింది. ఏపీలోని అర్హులైన 1.60 లక్షల మందికి పైగా యువతకు సాఫ్ట్ వేర్, ఇతర ఐటీ ఆధారిత రంగాల్లో శిక్షణ ఇప్పించడానికి మైక్రోసాఫ్ట్ తో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం తాజాగా యువతకు సాఫ్ట్ వేర్, ఇతర ఐటీ ఆధారిత రంగాల్లో శిక్షణ ఇప్పించడానికి మైక్రోసాఫ్ట్ తో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఉగాది సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఒప్పందం కుదిరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు.
మైక్రోసాఫ్ట్ తో ఏపీ సర్కార్ ఒప్పందం వల్ల 1.60 లక్షల మంది అర్హులైన యువతకు లబ్ధి కలుగుతుందని సీఎం ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణ తెలిపారు. ఉగాది సందర్భంగా నిరుద్యోగ యువతకు వైఎస్ జగన్ ఇచ్చిన అపూర్వ కానుకగా దీన్ని అభివర్ణించారు.
నిరుద్యోగ యువతకు సాఫ్ట్ వేర్, ఇతర ఐటీ ఆధారిత రంగాల్లో శిక్షణ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకు రావడం ఇదే మొదటిసారి అని హరికృష్ణ తెలిపారు.
ఇక శిక్షణ కాలం ముగిసిన తర్వాత యువతకు సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. వారి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి ఈ శిక్షణ , సర్టిఫికెట్స్ ఉపయోగపడుతాయని అన్నారు.