Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం జస్ట్ అలా చేస్తే చాలు !

By:  Tupaki Desk   |   13 March 2021 11:35 AM GMT
కరోనా వ్యాక్సిన్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం జస్ట్ అలా చేస్తే చాలు !
X
కరోనా టీకా తీసుకోవాలనుకునే వారికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకూ వ్యాక్సిన్ కావాలంటే, ముందుగా ఆన్ ‌లైన్‌ లో నమోదు చేయించుకోవాలి. ఇప్పుడు అది తప్పనిసరి కాదు అని ప్రభుత్వం వెల్లడించింది. అన్ని ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపింది. కొవిన్ యాప్ ‌లో నమోదు చేయించుకోకపోయినా వ్యాక్సిన్ కోసం వ్యాక్సిన్లు ఇచ్చే కేంద్రాలకు వచ్చిన వారిని అనుమతిస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే , 60 ఏళ్లు దాటిన వారు ఏదైనా ఐడీ కార్డు చూపించి వ్యాక్సిన్ పొందవచ్చు.

అలాగే... 45 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉండి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో బాధపడేవారు డాక్టర్ల సర్టిఫికెట్‌తో వ్యాక్సిన్ పొందవచ్చు. ఒకవేళ అది లేకపోయినా తమకు వ్యాధులు ఉన్నట్లుగా వేరే ఏదైనా ఆధారం చూపించి కూడా వ్యాక్సిన్ పొదవచ్చు. ఇక ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు ఏ వ్యాక్సినేషన్‌ కేంద్రానికైనా వెళ్లి టీకా తీసుకోవచ్చని ఆరోగ్య శాఖ తెలిపింది. ఆస్పత్రుల జాబితాను cowin.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని వైద్యారోగ్య శాఖ పేర్కొంది.

దేశంలో ఇప్పటివరకు 2.82 కోట్ల వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన కొత్తలో ఎవరైనా సరే వ్యాక్సిన్ కావాలంటే, తప్పనిసరిగా కొవిన్ యాప్‌ లో తమ వివరాలు నమోదు చేయించుకోవాలని రూల్ పెట్టారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దాన్ని తొలగించింది. ఎందుకంటే, ఇప్పటికే చాలా మంది పెద్దవాళ్లకి వ్యాక్సిన్ వేసేశారు. ఇంకా ఎవరైనా ఉంటే వారికి త్వరగానే వ్యాక్సిన్ వేసేందుకు ఇలా రూల్స్ లో మార్పు తీసుకువచ్చారు.