Begin typing your search above and press return to search.
నిమ్మగడ్డకు షాకిచ్చిన జగన్ సర్కార్
By: Tupaki Desk | 18 Nov 2020 6:00 AM GMTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు వడివడిగా ముందుకెళుతున్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు ఏపీ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. గవర్నర్ తో ఈరోజు భేటి అయ్యి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రకటించిన నిమ్మగడ్డకు తాజాగా ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాయడం సంచలనమైంది.
ఏపీలో పంచాయితీ ఎన్నికల అంశం సెగలు పుట్టిస్తోంది. కరోనా కేసులు తగ్గుతుండడం వల్ల ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ఈసీ అభిప్రాయపడుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. తాజాగా ఈ ఫైట్ మరింత ముదిరింది.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నిర్వహణ అంశంపై తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని లేఖ రాశారు. రాష్ట్రంలోని అధికారులు, పోలీసులు కరోనా విధుల్లో ఉన్నందున ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని అందులో పేర్కొన్నారు. అన్ని విధాలుగా ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ కు తెలియజేస్తామని ఆమె తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని.. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని సాహ్ని తన లేఖలో పేర్కొన్నారు.