Begin typing your search above and press return to search.

విశాఖ పై కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ ..ఏంటంటే

By:  Tupaki Desk   |   26 Feb 2020 10:45 AM GMT
విశాఖ పై కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ ..ఏంటంటే
X
విశాఖపట్నం ...ఈ సిటీకి అతి త్వరలో మహర్దశ పట్టబోతోంది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకి బీజం వేసిన జగన్ సర్కార్ ... దానికి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికి, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చెయ్యాలని అధికారులను ఆదేశించిన జగన్, తాజాగా విశాఖ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలతో .. విశాఖపట్నం రూపురేఖలే మారిపోనున్నాయి.

అతి త్వరలో ఏపీ పరిపాలన రాజధానిని విశాఖకు తరలించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం ..దానితో పాటుగా లైట్ మెట్రో రైలు పనుల ప్రక్రియ ప్రారంభించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. రెండు దశల్లో లైట్ మెట్రో, మూడు ట్రామ్ కారిడార్ల ఏర్పాటు చేయాలన్న ఆలోచన లో ఉంది. బీచ్ వెంబడి ట్రామ్ కారిడార్లు వచ్చేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో సీఎం సూచనల మేరకు బీచ్ వెంబడి ట్రామ్ కారిడార్ ఏర్పాటు కు సిద్దమవుతున్నారు.

విశాఖలో మొత్తంగా 140 కిలో మీటర్ల మేర లైట్ మెట్రో, ట్రామ్ కారిడార్లు ఏర్పాటు చెయ్యాలని భావిస్తుంది సర్కార్. ఇక డీపీఆర్ రూపకల్పనతో పాటు టెండర్ల ఖరారును ఏకకాలంలో చేపట్టేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎన్ ఏ డీ జంక్షన్-పెందుర్తి, అనకాపల్లి-స్టీల్ ప్లాంట్ వరకు రెండు ట్రామ్ కారిడార్లు, పాత పోస్టాఫీస్ నుంచి ఆర్కే బీచ్, రుషికొండ మీదుగా భీమిలీ వరకు బీచ్ వెంబడి మరొక ట్రామ్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక, స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక, తాటి చెట్లపాలెం, కొమ్మాది మీదుగా భోగాపురం ఎయిర్ పోర్టు వరకు లైట్ మెట్రో కారిడార్ లు ఏర్పాటు చేయబోతున్నాయి.