Begin typing your search above and press return to search.
ఎయిర్ పోర్ట్ రన్ వే పై జగన్ భైఠాయింపు
By: Tupaki Desk | 26 Jan 2017 11:23 AM GMTఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కేటాయించాలంటూ విశాఖలో జరగునున్న కొవ్వొత్తుల ర్యాలీకి బయల్దేరిన ఏపీ విపక్ష నేత వైఎస్ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కి అనూహ్య పరిణామం ఎదురైంది. విమానం దిగగానే జగన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విశాఖ విమానాశ్రయంలోని రన్ వేపై వైసీపీ అధినేత జగన్ బైఠాయించారు. జగన్‌తో పాటు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి - అంబటి రాంబాబు - వైవీ.సుబ్బారెడ్డిలు బైఠాయించారు. కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి లేదని జగన్ తో పోలీసులు వాగ్వాదం కొనసాగిస్తున్నారు.
మరోవైపు విశాఖలో ఈరోజు సాయంత్రం వైసీపీ కొవ్వొత్తుల ప్రదర్శన ఉన్న నేపథ్యంలో ఎన్‌ఏడీ జంక్షన్‌లో వైసీపీ నేతలు బొత్స సత్యానారాయణ, గుడివాడ అమర్ నాథ్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనుమతి లేనందున కొవ్వొత్తుల ప్రదర్శనకు హాజరుకావద్దని కోరారు. ఇదిలాఉండగా.. విశాఖపట్నం వైఎంసీఎ సమీపంలో పాతిక మంది జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక హోదాకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న వీరిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ నగరంలో ప్రదర్శనలు, ఆందోళనలకు అనుమతి లేకపోవడం, 144వ సెక్షన్ ను ఉల్లంఘించి వీరంతా ఒక చోట గుమిగూడి నినాదాలు చేయడంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏయూ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. నిరసన చేస్తున్న 200 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/