Begin typing your search above and press return to search.
క్యా 'కియా'? జగన్ నజర్ తో వేగం..
By: Tupaki Desk | 30 Jun 2019 6:49 AM GMTఅనంతపురం జిల్లాలోని ‘కియా’ కార్ల పరిశ్రమ.. దీన్ని ఏపీకి తీసుకొచ్చి పెద్ద ఘనకార్యం సాధించానని చంద్రబాబు ఎంతో ప్రచారం చేసుకున్నారని వైసీపీ శ్రేణులు ఆడిపోసుకున్నాయి. టీడీపీ ప్రకటనల్లోనూ కియా పేరును వాడేసుకున్నారు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి మాత్రం వేరోలా ఉందట. అందుకే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ నజర్ పెట్టారని తెలిసింది. కియాకు ఏకంగా మంత్రిని - కలెక్టర్ ను పంపి న్యాయం చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది..
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారి పల్లి సమీపంలో నిర్మితమైన కియ కార్ల పరిశ్రమ వివాదం ఈనాటిది కాదు. ఈ పరిశ్రమ కోసం పెనుకొండ రైతులు దాదాపు 375 మంది తమ భూములను ఇచ్చారు. వారి ఉపాధి పోగొట్టుకున్నారు. అయితే కియా వచ్చాక కేవలం 150మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా 250మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంకా ఇవ్వలేదు. సాంకేతిక పరిజ్ఞానం లేదంటూ పక్కన పెట్టడంతో వారంతా రోడ్డున పడ్డారు.
దీంతో ఈ విషయం తెలిసిన జగన్.. గడిచిన చంద్రబాబు పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. వెంటనే కియా కంపెనీకి బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయనను - కలెక్టర్ సత్యనారాయణను పంపించారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. కియాతో తమకు ఉపాధి లభిస్తుందని నిరుద్యోగ యువత ఆశలు పెట్టుకున్నారని.. వారి ఆకాంక్ష మేరకు జగన్ ఆదేశాల మేరకు తాను ఈ పరిశ్రమకు వచ్చానని మంత్రి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం లేని వారికి ట్రైనింగ్ ఇచ్చి తీసుకోవాలని కోరామని మంత్రి తెలిపారు.
కియా పరిశ్రమకు భూములు కోల్పోయిన రైతుల కుటుంబంలో నిరుద్యోగులు ప్రతీ ఒక్కరి ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. 75శాతం కియా పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కియా యాజమాన్యాన్ని కోరామన్నారు. ఇలా ప్రచారం తప్పితే ఉపాధి కల్పించని బాబు హయాంను మరిపిస్తూ జగన్ ఇలా దూకుడుగా కియా పరిశ్రమకు మంత్రిని పంపి వార్నింగ్ ఇప్పించడం చర్చనీయాంశంగా మారింది.