Begin typing your search above and press return to search.
బాబు కన్నా.. నేను తక్కువ అప్పులే చేశా: జగన్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 15 July 2022 10:25 AM GMTఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీ అప్పుల కుప్పగా మారిపోతోందని వస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వం చాలా తక్కువ అప్పులే చేస్తోందని తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసిందని.. తాము చేసేది కొంచెమేనని వ్యాఖ్యానించారు. గత చంద్రబాబు ప్రభుత్వం దత్తపుత్రుడు చెప్పినట్టు నడుచుకుందని విమర్శించారు. కానీ, తమ ప్రభుత్వంలో దత్తపుత్రులు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు.
నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే వాహనమిత్ర పథకం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
శుక్రవారం ఆయన విశాఖపట్నంలో జరిగిన 'వైఎస్సార్ వాహన మిత్ర' పథకం కార్యక్రమంలో ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను బటన్‌నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కరోనా సమయంలోనూ వాహన మిత్ర పథకం అమలు చేశామని, మనది పేదల ప్రభుత్వం.. పేదలకు అండగా ఉండే ప్రభుత్వమని అన్నారు.
మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా కూడా లంచాలు లేవు, వివక్ష లేదన్నారు. కులం చూడలేదు, పార్టీ చూడలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని ప్రజలను సీఎం కోరారు.
"గత ప్రభుత్వం కన్నా ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా తక్కువేనని సీఎం జగన్ అన్నారు. వాహన మిత్ర పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. పేద వర్గాల గురించి నిరంతరం ఆలోచిస్తున్న ప్రభుత్వం మనది. గత ప్రభుత్వంలో దోచుకో.. పంచుకో ఉండేది. మన ప్రభుత్వంలో దోచుకోవడం లేదు.. పంచుకోవడం లేదు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. రాష్ట్రంలో ఇంటింటికి మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వం ఉంది.
నలుగురు ధనికుల కోసం, దత్తపుత్రుడి కోసం నడిచే ప్రభుత్వం కాదన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దుష్టచతుష్టయంగా తయారయ్యారు. అబద్ధాలు చెప్పడంలో దుష్టచతుష్టయం మించినవారు లేరు. నాకు ఉన్నది నిబద్ధత, నిజాయితీ, మీతోడు, దేవుడి ఆశీస్సులు" అని సీఎం జగన్ అన్నారు.