Begin typing your search above and press return to search.

జగన్‌ డెడ్‌ లైన్‌ నిజమేనా.?

By:  Tupaki Desk   |   16 Feb 2019 7:30 AM GMT
జగన్‌ డెడ్‌ లైన్‌ నిజమేనా.?
X
ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నోటిఫికేషన్‌ రాలేదనే కానీ.. నేతలు రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో తలమునకలైపోయారు. మరోవైపు.. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్‌ జపాంగ్‌ లు కూడా ఎక్కువయ్యాయి. అయితే.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. టీడీపీ నుంచే ఎక్కువమంది వైసీపీకి వెళ్తున్నారు. మొన్నటికి మొన్న మేడా - ఆమంచి - నిన్న అవంతి - దాసరి జై రమేష్‌.. ఇలా టీడీపీ లీడర్లంతా జగన్‌ ని కలుస్తున్నారు. పార్టీలో చేరిపోతున్నారు. ఇన్నాళ్లూ లేనిది ఇంత సడన్‌గా ఎందుకు జపాంగ్‌ లు స్టార్ట్‌ అయ్యాయి అంటే దానికి కారణం జగన్ పెట్టిన డెడ్‌ లైనే నట.

ఎన్నికల్లో ప్రతీ పార్టీకి సీట్ల సర్దుబాటు తప్పదు. కొత్తగా పార్టీలోకి వచ్చేవారిని చేర్చుకుని వారికి వారి అడిగిన స్థానాల్లో సీటు ఇవ్వాలి. అందుకే.. ఎవరైనా వచ్చేవాళ్లు ఉంటే.. ఫిబ్రవరి 20లోపు రావాలని జగన్‌ ఆల్టిమేటమ్‌ జారీ చేశారట. 20 లోపు వచ్చేవారికే సీట్ల కేటాయింపునకు సంబంధంచి హామీ ఉంటుందని.. తర్వాత వచ్చేవారు పార్టీలో చేరినా.. సీట్లు వచ్చే అవకాశాలు మాత్రం ఉండవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. దీంతో.. అందరూ హాడావుడిగా జగన్‌ దగ్గరకు వెళ్లి వాలిపోతున్నారు. ఇప్పటికే ముగ్గురు లీడర్లు వైసీపీలోకి వెళ్లారు. 20 లోపు కనీసం మరో 15 మంది లీడర్స్‌ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని రాజకీయ వర్గాలంటున్నాయి.