Begin typing your search above and press return to search.

డిసెంబర్ 31ని డెడ్ లైన్ గా పెట్టిన జగన్

By:  Tupaki Desk   |   30 Nov 2020 11:00 PM IST
డిసెంబర్ 31ని  డెడ్ లైన్ గా  పెట్టిన జగన్
X
నివర్ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు నఫ్టపరిహారాన్ని అందించేందుకు డిసెంబర్ 31వ తేదీని డెడ్ లైనుగా నిర్ణయించినట్లు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. వ్యవసాయ సాయం అనే సబ్జెక్టుపై జగన్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో రాజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడుతున్నట్లు చెప్పారు. దీని కారణంగా భూగర్భజలాల మట్టం కూడా పెరిగిందన్నారు. తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు అందరికీ నష్టపరిహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసినట్లు జగన్ తెలిపారు.

ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్లో ఇన్ పుట్ సబ్సిడి అందివ్వాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నట్లు జగన్ చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ద్వారా తమది రైతు పక్షపాత ప్రభుత్వమని అందరికీ అర్ధమవుతోందన్నారు. ఖరీష్ సీజన్లో నష్టపోయిన రైతులకు ఖరీఫ్ సీజన్లోనే పరిహారం అందించటం చరిత్రలోనే మొదటిసారిగా చెప్పారు. ఇప్పటికే రూ. 126 కోట్ల ఇన్ పుట్ సబ్సిడిని అందించిన విషయం జగన్ గుర్తుచేశారు. అలాగే అక్టోబర్ లోకురిసిన భారీ వర్షాలకు, తుపాను వల్ల నష్టపోయిన పంటల పరిహారాన్ని నవంబర్లో రూ. 132 కోట్లు అందించామన్నారు.

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను కూడా తమ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ రూ. 500 అందించామన్నారు. డిసెంబర్ 15లోగా జరిగిన నష్టాన్ని అంచనా వేయమని అధికారులను ఆదేశించినట్లు జగన్ చెప్పారు. నష్టాల అంచనాలు తమకు అందగానే డిసెంబర్ 31లోగా పరిహారాన్ని రైతులకు అందిస్తామన్నారు. 80 శాతం సబ్సిడితో విత్తనాలను కూడా అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

తుపాను, వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల నష్టపరిహారం అందించిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు. వర్షాల కారణంగాన రంగు మారిన ధాన్యాన్నే కాదు చివరకు మొలకలెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొంటుందని హామీ ఇచ్చారు. 2020 ఖరీఫ్ సీజన్ నుండి పంటల బీమా బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. పంటల ఉచిత బీమా కోసం ప్రభుత్వం రూ. 1030 కోట్లు చెల్లించినట్లు జగన్ తెలిపారు.