Begin typing your search above and press return to search.
జగన్ ఫోకస్!...ఇప్పుడు సాంతం ఏపీపైనే!
By: Tupaki Desk | 4 Feb 2019 3:50 PM GMTవైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇకపై ఏపీ రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ పెట్టనున్నారు. ప్రస్తుతం కూడా ఏపీ పాలిటిక్స్ మీదే తన పూర్తి స్థాయి దృష్టిని సారించిన జగన్.. నివాసం పరంగా హైదరాబాదులో ఉంటుండటంతో కొంతమేర గ్యాప్ కనిపిస్తోంది. అయితే అమరావతి పరిధిలో జగన్ నిర్మించుకుంటున్న ఇల్లు - పార్టీ కార్యాలయం దాదాపుగా పూర్తి కావచ్చాయి. నిర్మాణం పూర్తి అయిన ఈ భవనం ఇప్పుడు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ నెల 14న జగన్ లాంఛనంగా ఆ నివాసంలోకి అడుగుపెట్టనున్నారు. టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్న ఈ కార్యక్రమంపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాదులో ఉంటున్నా.. ఏపీ పాలిటిక్స్ పైనే దృష్టి సారించిన జగన్... ఇక అమరావతికి తన ఇంటిని షిఫ్ట్ చేసుకుంటే... మరింతగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది. పార్టీ కేడర్ మొత్తం ఏపీలో - జగన్ మాత్రం హైదరాబాదులో ఉంటున్న నేపథ్యంలో అధినేత - నేతల మధ్య కొంత గ్యాప్ ఉన్న మాట వాస్తవమే.
ఈ గ్యాప్ ఎంతోకాలం ఉండటానికి వీలు లేదని తేల్చేసుకున్న మీదటే జగన్... అప్పటికప్పుడు అమరావతిలో స్థలం కొనుగోలు చేయడం - ఆ వెంటనే ఇల్లు - పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారంభమైపోవడం జరిగింది. ఈ నిర్మాణం కూడా ఇప్పుడు పూర్తి కావడంతో ఈ నెల 14న జగన్ ఈ ఇంటిలోకి చేరిపోనున్నారు. వెరసి తాను హైదరాబాదులో ఉంటున్నానని విపక్షాలు చేస్తున్న విమర్శలకు కూడా తావు లేని విధంగా జగన్ వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే... ఇప్పటికే 14 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన జగన్... తన పాదయాత్రలో టచ్ చేయని నియోజకవర్గాలను చుట్టి రావాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రచించుకున్న జగన్... ఈలోగా ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో...అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. అయితే సమయం అంతగా లేని నేపథ్యంలో జిల్లాల వారీగా బూత్ లెవెల్ నాయకులతో పాటుగా తటస్థులతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
భేటీలు జిల్లాల వారీగానే జరుగుతున్నా... జగన్ మాత్రం ఆ జిల్లాల్లోని వేర్వేరు నియోకవర్గాలకు చెందిన కార్యకర్తలతో వేర్వేరుగానే భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ భేటీలకు సంబంధించిన కార్యాచరణ కూడా పూర్తి అయినట్టు సమాచారం. అమరావతిలోని ఇంటిలో చేరిన తర్వాత జిల్లాల పర్యటనలకు వెళ్లడానికి - పార్టీ కార్యాలయానికి వచ్చిన కార్యకర్తలతో బేటీలు కావడానికి జగన్ కు మరింత మేర సమయం దొరుకుతుందన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా ఏ పార్టీతో సంబంధం లేని 75 వేల మంది తటస్థులకు జగన్ ఇప్పటికే తన విజన్ ఏమిటో తెలియజేస్తూ ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలు అందుకున్న వారు ఎవరైనా జగన్‌ను కలిసి సలహాలు - సూచనలు అందించే వీలుంది. ఈ నేపథ్యంలో జగన్ అమరావతికి షిఫ్ట్ అవ్వడం కూడా ఈ తరహా భేటీలకు మరింతగా సౌలభ్యం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా ఈ నెల 14 నుంచి జగన్ ఏపీ భూభాగంలోనే ఉంటూ... ఏపీ పాలిటిక్స్ పై మరింతగా దృష్టి పెట్టడంతో పాటు ఎన్నికల వేళ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపేందుకు అవకాశం ఉందన్న మాట.