Begin typing your search above and press return to search.
విశాఖలో మళ్లా విజయ్ ప్రసాద్ కు జగన్ షాకిచ్చారా?
By: Tupaki Desk | 27 Jun 2022 4:50 AM GMTవిశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మళ్లా విజయ్ ప్రసాద్ కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ షాకిచ్చారా అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. నియోజకవర్గ ఇన్చార్జిగా మళ్లా విజయ్ ప్రసాద్ ను తప్పించి విశాఖ డెయిరీ వైస్ చైర్మన్ అడారి ఆనంద్ ను విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడం ఇందుకు సంకేతమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లా విజయ్ ప్రసాద్ అడుగులు ఎటు వేస్తారోనని నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారని అంటున్నారు.
వాస్తవానికి విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా చాలాకాలం నుంచి మళ్లా విజయ్ ప్రసాద్ కొనసాగుతున్నారు. అయితే ఆయన వ్యాపారపరమైన ఇబ్బందులతో క్రియాశీలకంగా ఉండటంలేదని చెబుతున్నారు. అంతేకాకుండా ఆయన వ్యాపార సంస్థలపై సీబీఐ కేసులు నమోదు చేసిందని గుర్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయన కూడా జైలుకు కూడా వెళ్లి వచ్చారని పేర్కొంటున్నారు.
దీంతో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విశాఖ డిప్యూటీ మేయరు జియ్యాని శ్రీధర్ కు వైఎస్సార్సీపీ అధిష్టానం అప్పగించింది. ఆయనను సమన్వయకర్తగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది.
అయితే దీనికి మళ్లా విజయ్ ప్రసాద్ అభ్యంతరం తెలిపారని అంటున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను తన భార్య లేదా కుమార్తెకు అప్పగించాలని కోరినట్టు చెబుతున్నారు. దీనికి అధిష్టానం నిరాకరించిందని అంటున్నారు. మళ్లా విజయ్ ప్రసాద్ కు గతంలో ఏపీ విద్యా మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఇంకో పదవి కుటుంబంలో ఇవ్వడం సాధ్యం కాదని వైఎస్సార్సీపీ అధిష్టానం చెప్పిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ డెయిరీ వైస్ చైర్మన్ అడారి ఆనంద్ ను విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిందని పేర్కొంటున్నారు.
కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నగరంలో ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విశాఖ నగరంపై వైఎస్సార్సీపీ దృష్టిస సారించిందని తెలుస్తోంది.