Begin typing your search above and press return to search.

ఈ ఫిర్యాదులు చూసి జ‌గ‌న్ షాక‌య్యాడు తెలుసా?

By:  Tupaki Desk   |   3 Nov 2022 1:30 AM GMT
ఈ ఫిర్యాదులు చూసి  జ‌గ‌న్  షాక‌య్యాడు తెలుసా?
X
ఏపీ సీఎం జ‌గ‌న్ అన్ని విష‌యాల‌ను సీరియ‌స్‌గా తీసుకోర‌ని వైసీపీలోనే ఒక చ‌ర్చ ఉంది. అయితే, అన్ని విష‌యాలు అంటే.. అవేంటో మాత్రం చెప్ప‌క పోయినా.. ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే సీఎం జ‌గ‌న్ అలానే వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం క‌ళ్ల‌కు క‌డుతోంది. అయితే, ఇటీవల కొన్నాళ్లుగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో పార్టీ కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్ష చేస్తున్నారు. ప్ర‌తి ఒక్క నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్ర‌త్యేకంగా చూస్తున్న‌ట్టు ఆయ‌న సంకేతాలు పంపించారు. ఈ స‌మ‌యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వం ఏయే ప‌థ‌కాల‌కు ఎంతెంత ఖ‌ర్చు చేసిందో కూడా చెబుతున్నారు.

ఈ సంద‌ర్భంగా క‌ర్నూలులోని ఎమ్మిగ‌నూరు, నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గాలు, విజ‌య‌వాడ తూర్పు, శ్రీకాకుళంలోని ప‌లాస‌, టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గాల పై స‌మీక్ష చేసిన సమ‌యంలో జ‌గ‌న్ విస్తుపోయేలా అక్క‌డి నాయ‌కులు కొన్ని ఫిర్యాదులు చేశార‌ట‌.

అవేంటంటే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల నుంచి నాయ‌కుల‌ను పిలిపించారు. అయితే, వీరంతా క‌ల‌సి ఉన్నార‌ని జ‌గ‌న్ భావించారు. కానీ, ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌నుంచి మాత్రం విడివిడిగా నాయ‌కులు జ‌గ‌న్ పేషీలోకి అడుగు పెట్టారు. అదేంటి? నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కులు అంటే అంద‌రూ క‌లిసి రావాలి క‌దా విడివిడిగా వ‌చ్చారేంట‌ని నిల‌దీశారు.

దీనిపై నాయ‌కుల స్పంద‌న చూసి జ‌గ‌న్ విస్మ‌యానికి గుర‌య్యార‌ట‌. త‌మ‌కు అక్క‌డి ఇంచార్జ్‌నాయ‌కుడికి అస్స‌లు ప‌డ‌డం లేద‌ని వారు చెప్పారు. అంతేకాదు.. మీరు ఆయన‌కు టికెట్ ఇస్తే క‌ష్ట‌మే, గెలుపు గుర్రం ఎక్క‌లేమ‌ని ఒక వ‌ర్గం మ‌రో వ‌ర్గంపై ఆరోప‌ణ‌లు చేస్తే, మ‌రో వ‌ర్గం అస‌లు మీకు ఫిర్యాదు మోసుకువ‌చ్చిన వ‌ర్గం టీడీపీతో అంత‌ర్గ‌తంగా చ‌క్రం తిప్పుతోంద‌ని, వారికి ప్ర‌భుత్వంలోని లోపాల‌పైనా, తీసుకోబోయే నిర్ణ‌యాల‌పైనా ముందుగానే ఉప్పందిస్తూ పార్టీకి చేటు చేస్తోంద‌ని వివ‌రించార‌ట‌. దీంతో సీఎం జ‌గ‌న్ అవాక్క‌య్యార‌ట‌. అసలు ఇప్ప‌టి వ‌ర‌కు తాను చెప్పేది నాయ‌కులు వినాల‌నే టైపులో వ్య‌వ‌హ‌రించే జ‌గ‌న్ ఇప్పుడు వీరు చెప్పిన వినేందుకు టైం ఇచ్చారు.

ఇలా.. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా 12 నియోజ‌క‌వ‌ర్గాల‌పై స‌మీక్ష చేస్తే ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. అంటే, అక్క‌డ పార్టీలో నేత‌లు రెండుగా చీలిపోయి ఒక‌రికి టికెట్ ఇస్తే.. మ‌రొక‌రు ఓడించాల‌నే నిర్ణ‌యంతొ ముందుకు సాగుతున్నార‌నే విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ గ్ర‌హించారు.

ఈ నేప‌థ్యంలో అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల‌ను స‌రిదిద్దేందుకు ఒక క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతు న్నాయి. ''ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి పేప‌ర్ల‌లో వ‌స్తేకావాల‌ని చిచ్చు పెట్టేందుకు రాస్తున్నార‌ని భావించాం. కానీ, తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై సీఎం సీరియ‌స్‌గా ఉన్నారు. ఇక‌, వాళ్లఆట‌లు సాగ‌వు'' అని ముఖ్య స‌ల‌హాదారు ఒక‌రు పార్టీ నేత‌ల‌తో చెప్పిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.