Begin typing your search above and press return to search.
‘‘జై ఆంధ్రప్రదేశ్’’ సభలో జగన్ ఏం చెప్పారు?
By: Tupaki Desk | 7 Nov 2016 4:44 AM GMTప్రత్యేక హోదా అంశాన్ని ఉద్యమంగా మార్చి.. హోదా సాధన కోసం ఆంధ్రోళ్లను ఏకతాటి మీదకు తీసుకొచ్చి.. కేంద్రానికి చుక్కలు చూపించాలన్నట్లుగా ఉంది ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే. హోదా మీద అప్పుడోసారి.. అప్పుడోసారి అన్నట్లుగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న జగన్.. తాజాగా విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను ‘‘జై ఆంధ్రప్రదేశ్’’ పేరిట నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన అంశంతో పాటు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హోదా సాధన కోసం జగన్ సభను నిర్వహించినా.. ఆయన ప్రసంగంలో ఎక్కువ భాగం సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన మాటలు.. ఇచ్చిన హామీలు.. గడిచిన 30 నెలల్లో టీడీపీ సర్కారు పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం మీదా.. మోడీ పైనా విమర్శల్ని ఆచితూచి మాట్లాడిన ఆయన.. తన ఫోకస్ మొత్తం హోదా మీద కంటే చంద్రబాబు మీదనే అన్న విషయాన్ని తన మాటలతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
భావోద్వేగ ప్రసంగం చేయని జగన్.. కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సభికుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. సాదాసీదా మాట్లాడినట్లుగా కనిపించిన జగన్ ప్రసంగం మధ్య మధ్యలో మాత్రం మెరుపులతో అదరగొట్టేశారని చెప్పక తప్పదు.
హోదా అంశంపై ఆయన మాట్లాడుతూ చెప్పిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. ఆంధ్రుడేం చేయాలన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పొచ్చు. సీమాంధ్రులకు హోదా సాధనలో కర్తవ్య సాధన ఎలా అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. ‘‘ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తెగేసి చెప్పింది. హోదా తీసుకురావాలన్న ఆలోచన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదు. హోదా మన హక్కు. ఇవ్వటం వారి బాధ్యత. ఇవ్వకపోతే మనం చేతులు కట్టుకొని కూర్చోవాలా? చేతులు కట్టుకొని కూర్చునే జాతేనా మనది? చేతులు కట్టుకొని కూర్చుంటే బ్రిటీష్ పరిపాలన ఇప్పటికీ ఉండేది. ఇప్పటికీ మద్రాసీల దగ్గర ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండేవాళ్లం. తెలుగు జాతి తఢాఖా చూపిద్దాం’’ అని ఫైర్ అయ్యారు.
విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన జగన్.. కాస్తంత సుదీర్ఘంగానే మాట్లాడారని చెప్పాలి. ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు తాను భయపడనని.. ఉద్యమాలంటే వెరుపులేదని.. జైళ్లంటే భయం లేదన్నారు. ప్రాణాలు పోతాయన్న బాధ లేదని.. పిల్లల భవిష్యత్ కోసం ఉద్యమాన్ని ఏస్థాయికైనా తీసుకెళ్తామని స్పష్టం చేసిన జగన్.. అన్ని ప్రాంతాల్లో తాము సభలు పెడతామని.. యువభేరీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అసెంబ్లీ.. పార్లమెంటులలో ఒత్తిడి తీసుకురావటానికి ప్రయత్నిస్తామని.. అప్పటికి హోదా ఇవ్వకపోతే ఎంపీల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళతామని జగన్ పేర్కొన్నారు.
ఉప ఎన్నికల ద్వారా మనకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం మొత్తం చూసేలా చేస్తామన్న జగన్.. 2019 ఎన్నికల అజెండా ఏమిటన్నది ఇప్పుడే చెప్పేశారు. ప్రత్యేక హోదా సాధన రెఫరెండంగా జరిగేలా ఎన్నికల్లో ప్రచారం చేస్తామన్నారు. తానిప్పుడు మాట్లాడుతున్న వేదిక మీద నుంచే ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబు.. మోడీలు ప్రత్యేక హోదాను పదేళ్లు ఇస్తామని చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.
అబద్ధాలు చెప్పి.. మోసం చేసి.. రాజకీయాలు చేస్తున్న నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా జై ఆంధ్రప్రదేశ్ అని నినాదం చేయాలని.. ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ విశాఖ అని.. అలాంటి విశాఖ నుంచి హోదాపై మరో ఉద్యమం రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమానికి యాభై ఏళ్లు నిండాయని.. ముల్కీ నిబంధనలకు జై ఆంధ్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ విశాఖ అని.. అలాంటి ఈ గడ్డ మీద నుంచే ప్రత్యేక హోదా సాధన కోసం మరో భారీ ఉద్యమంరావాలన్న ఆకాంక్షను జగన్ వ్యక్తంచేయటం గమనార్హం.
ప్రసంగాలతో ఉదరగొట్టాలని తాను విశాఖకురాలేదని.. కొన్ని భావాలు పంచుకోవటానికి.. కొన్ని ఆలోచనలు చెప్పటానికి మాత్రమే తాను వచ్చినట్లుగా చెప్పిన జగన్.. ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబు ఇచ్చిన హామీల అమలు ఎంత మేరకు జరిగాయన్న విషయాన్ని ఒక్కొక్క అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ..జగన్ నుంచి రెండు చేతులు ఎత్తి తమ అభిప్రాయాన్ని చెప్పాలని చెప్పటం గమనార్హం. హోదా సాధన విషయంలో బాబు తప్పుల్ని తీవ్రస్థాయిలో ఎండగట్టిన జగన్.. ఒకదశలో బాబుపై టాడా కేసు పెట్టినా తప్పు లేదని వ్యాఖ్యానించారు.
ఇటీవల విజయవాడలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఏపీకి 25 సంస్థలు ఇచ్చినట్లుగా చెప్పారని.. తాను ఒకే ఒక్క ప్రశ్న సూటిగా అడుతానని చెప్పిన జగన్.. ‘‘దేశంలో 29 రాష్ట్రాల్లో కోటి జనాభా పైన ఉన్న రాష్ట్రాలు 20 ఉన్నాయి. కోటి జనాభా ఉన్న ఏ రాష్ట్రంలో సంస్థలు లేవు? కోటి జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఐఐటీలు 22.. ఎన్ ఐటీలు30.. సెంట్రల్ యూనివర్సిటీలు 41.. ఐఐఎంలు 19.. ట్రిపుల్ ఐటీలు 19 ఉన్నాయి. మరి.. వాళ్లు రాష్ట్రానికి ఏం మేలుచేస్తున్నట్లు? మాకు దానమో ధర్మమో ఇస్తున్నట్లుగా ఈ రోజు మాట్లాడతారు. మీకేదో ధర్ చేస్తున్నాం.. బిచ్చమేస్తున్నాం.. దయ చూపిస్తున్నాం అన్నట్లుగా మాట్లాడటానికి మనసు ఎలా వస్తుంది? ఇటీవల గుజరాత్ కు రైల్వే వర్సిటీనిని ఏ యాక్ట్ ప్రకారం ఇచ్చారు? యాక్ట్ లో ఉండే విశాఖకు రైల్వే జోన్ ఎందుకు ఇవ్వటం లేదు? ఆ రోజున హైదరాబాద్ లో అనేక సంస్థలు ఏర్పాటు చేశారు. ఏ యాక్ట్ ఉన్నదని ఆ రోజు హైదరాబాద్ లో అన్ని సంస్థలు పెట్టారు? సిగ్గు లేకుండా 40 ఏళ్లల్లో ఎప్పుడూ ఇవ్వనటువంటివి ఏపీకి ఇచ్చామని చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉన్నవి ఏపీలో కూడా పెడతామన్న మాటన్నా మీ నోట్లో నుంచి వస్తుందా? హోదా ఇవ్వకపోగా.. అబద్ధాలు ఆడుతూ పుండు మీద కారం జల్లటం భావ్యమేనా?’’ అని ఫైర్ అయ్యారు.
మేధావుల మౌనం సమాజానికి చేటు అని.. మూర్ఖులు అబద్ధాలు నిజమని వాదిస్తే.. మేధావులు మౌనంగా ఉండపోవటం అనేక అనర్థాలకు కారణం అంటూ బ్రిటీష్ ఫిలాసఫర్ రస్సెల్ చేసిన వ్యాఖ్యను ఉటంకించిన జగన్.. మేధావులు గొంతెత్తాలని.. ఏపీ ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. పోరుబాటలో నడిచి ప్రత్యేకహోదా సాధిద్దామని.. జగన్ కు ప్రజల తోడు కావాలని.. జగన్ కు మీ అండదండలు కావాలని.. అప్పుడేప్రత్యేక హోదా సాధన సాధ్యమవుతుందని చెబుతూ.. తనకేం కావాలన్నది చెప్పకనే చప్పేశారని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/