Begin typing your search above and press return to search.

బాబు అడ్డాలో.. జ‌'గ‌న్' ఫైరింగ్‌

By:  Tupaki Desk   |   31 Dec 2017 4:45 AM GMT
బాబు అడ్డాలో.. జ‌గ‌న్ ఫైరింగ్‌
X
నిర్విరామంగా సాగుతున్న ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర 47 రోజుల్ని పూర్తి చేసుకుంది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో ప్ర‌స్తుతం విప‌క్ష నేత పాద‌యాత్ర కొన‌సాగుతోంది. బాబు రాక్ష‌స పాల‌న‌పై జ‌గ‌న్ గ‌ళం విప్పి.. చేస్తున్న త‌ప్పుల్ని వ‌రుస పెట్టి చెబుతున్న వైనంపై బాబు సొంత జిల్లాలో భారీ స్పంద‌న వ్య‌క్తం కావ‌టం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా చిత్తూరు జిల్లా తంబ‌ళ్ల‌ప‌ల్లెలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు భారీ ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లిరావ‌టం విశేషం. పోటెత్తిన జ‌న‌సంద్రాన్ని ఉద్దేశించి జగ‌న్ ప్ర‌సంగించారు. బాబు జ‌మానాలో జ‌రిగిన దుర్మార్గాన్ని ఎండ‌గ‌ట్టిన జ‌గ‌న్‌ కు అక్క‌డి ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌లికారు. రైతుల‌కు తోడుగా నిలిచే స‌హ‌కార‌.. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్ని బాగుప‌రిచేందుకు చంద్ర‌బాబు స‌ర్కారు ఎప్పుడు కృషి చేయ‌లేని.. ఆయ‌న హ‌యాంలో ఉన్న సంస్థ‌ల‌న్నీ మూత‌ప‌డుతూనే ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు స‌హ‌కార ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు మూత‌ప‌డుతుంటే.. మ‌రోవైపు ప్రైవేటు సంస్థ‌లు మాత్రం లాభాలతో న‌డుస్తుంటాయ‌ని విమ‌ర్శించారు.

గ‌తంలో ఒక‌సారి తొమ్మిదిన్నరేళ్ల పాటు సాగిన బాబు పాల‌నలో పెద్ద ఎత్తున స‌హ‌కార రంగంలోని చ‌క్క‌ర ఫ్యాక్ట‌రీలు.. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు మూత‌బ‌డితే.. వైఎస్ హ‌యాంలో మాత్రం స‌హ‌కార రంగానికి చెందిన సంస్థ‌లు తిరిగి తెరిచార‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.

ఏపీ ప్ర‌జ‌ల ఖ‌ర్మ కొద్దీ బాబు ముఖ్య‌మంత్రి అయ్యార‌ని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలోని రేణిగుంట‌.. చిత్తూరులో ఉన్న చ‌క్కెర ఫ్యాక్ట‌రీలు మూత‌ప‌డే ప‌రిస్థితులో ఉంటే.. ప్రైవేటు రంగంలో ఉన్న నాలుగు చ‌క్కెర ఫ్యాక్ట‌రీలు మాత్రం బాగా లాభాల్లో న‌డుస్తున్నాయ‌న్నారు. ఏపీలో ఎక్కువ‌మంది రైతులు పాల మీద జీవ‌నం సాగిస్తుంటార‌ని. రోజుకు 80 ల‌క్ష‌ల లీట‌ర్ల పాలు ఉత్ప‌త్తి అవుతున్నా.. వారికి ఆర్థిక ప‌రిస్థితి మాత్రం దుర్భ‌రంగా ఉన్నాయ‌న్నారు.

ఇబ్బందుల్లో ఉన్న పాడి ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోవాల‌న్న ఆలోచ‌న బాబు చేయ‌ర‌న్నారు. హెరిటేజ్ సంస్థ‌కు రైతుల నుంచి త‌క్కువ ధ‌ర‌కు పాలు ఎలా కొనాల‌న్న దిక్కుమాలిన ఆలోచ‌న‌లు మాత్ర‌మే చేస్తారంటూ మండిప‌డ్డారు. ఏపీకి పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ‌.. క‌ర్ణాట‌క‌లోని ప్ర‌భుత్వ డెయిరీల‌కు రైతులు పాలు అమ్మితే ఒక లీట‌రు పాల‌కు నాలుగైదు రూపాయిల చొప్పున స‌బ్సిడీ ఇస్తున్నాయి.. ఇందుకు భిన్నంగా ఎపీలో మాత్రం లీట‌రుకు రూ.4 నుంచి రూ.5 త‌గ్గించి కొనాల‌నే దిక్కుమాలిన ఆలోచ‌న చేస్తున్నారంటూ మండి ప‌డ్డారు.

త‌న కంపెనీకి లాభాలు రావాలంటే ప్ర‌భుత్వ డెయిరీల‌కు పాల‌ధ‌ర‌ను త‌గ్గించి కొనాల‌నేదే చంద్ర‌బాబు విధాన‌మ‌ని.. అందుకే త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌భుత్వ డెయిరీల‌కు రైతులు అమ్మే ప్ర‌తి లీట‌రు పాల‌కు రూ.4 స‌బ్సిడీ ఇచ్చి కొనుగోలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. అంతేకాదు.. ప్ర‌భుత్వం రంగంలో మూత‌ప‌డిన పాల ఫ్యాక్ట‌రీల‌ను తిరిగి తెరుస్తామ‌ని చెప్పారు. ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువ‌గా ఉన్న తంబళ్ల ప‌ల్లి వాసుల‌కు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందిస్తే మేలు జ‌రుగుతుంద‌న్నారు. త‌న తండ్రి దివంగ‌త మ‌హానేత వైఎస్ హ‌యాంలో హంద్రీనీవా ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేశార‌ని.. మిగిలిన 20 శాతం ప‌నుల్ని గ‌డిచిన నాలుగేళ్ల‌లో బాబు ప్ర‌భుత్వం పూర్తి చేయ‌లేద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినంత‌నే హంద్రీనీవా ప్రాజెక్టు ప‌నుల్ని పూర్తి చేసి.. ప్ర‌తి చెరువుకూ నీళ్లు ఇస్తామ‌ని చెప్పారు. జ‌గ‌న్ ప్ర‌సంగానికి భారీ ఎత్తున చిత్తూరు జిల్లా వాసులు సానుకూలంగా స్పందించ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.