Begin typing your search above and press return to search.
జగన్ మొదలుపెట్టాడు
By: Tupaki Desk | 10 Aug 2015 6:50 AM GMTఏపీ కి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. జంతర్ మంతర్ వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి చేస్తున్నారు. ప్రత్యేక హోదా పై గతంలో అనేక సార్లు విన్నవించినా కేంద్ర వైఖరి లో మార్పు రాలేదని.. అందువల్లే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని నేతలు తెలిపారు. కేవలం ధర్నానే కాకుండా ఢిల్లీలోని పార్లమెంట్ వరకూ మార్చ్ నిర్వహిస్తున్నట్లు వైసీపీ నేతలు వివరించారు.
ఏపీలో ప్రతిపక్షంగా వున్న వైఎస్సార్ సీపీ ప్రత్యేక హోదా విషయాన్ని సీరియస్ గా తీసుకొని ప్రత్యేక హోదా అంశం పై ఢిల్లీ వేదికగా పోరాటం చేసేందుకు సిద్ధం అయింది. ఇందుకోసం వైఎస్సార్ సీపీ ఏర్పాట్లు భారీ స్థాయిలోనే చేసింది. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే లు, ముఖ్యనేతలు, పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి చేరేలా కసరత్తు చేశారు. రెండు రైళ్ల లో కార్యకర్తలు, నేతలను ఢిల్లీకి తరలించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆనుసరిస్తున్న వైఖరిని జాతీయ స్థాయిలో ఎండగట్టాలనీ భావించిన వైస్సార్ సీపీ నేతలు ఈ ధర్నాకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిలదీయడానికి అధికార టీడీపీ తో పాటు, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కూడా భయపడుతోందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా ద్వారా సమాధానం చెప్పేందుకే వైఎస్సార్ సీపీ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. అయితే జగన్ చేస్తున్న ధర్నాతో కేంద్రం దిగివస్తుందా? జాతీయ పార్టీలు జగన్ ధర్నాకి మద్దతు ఇస్తారా? అనేది వేచి చూడాలి.