Begin typing your search above and press return to search.
జగన్ కాకినాడ టూర్.. ఫుల్ బిజీ బిజీ!!
By: Tupaki Desk | 27 Aug 2017 4:24 AM GMTఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ శ్రేణుల నుంచి ఒకటే మాట వినిపిస్తోంది. అదేమంటే... *ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాకినాడకు `అన్న వస్తున్నాడు`! కాపులకు ఇచ్చిన మోసాలను వివరిం చి.. వారి హక్కుల కోసం ఉద్యమిస్తున్న నాయకులపై ప్రభుత్వం ఎలా ఉక్కుపాదం మోపుతోందో తెలిపేందుకు `అన్న వస్తున్నాడు`! కల్లబొల్లి మాటలతో, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్న వారికి సమాధా నం చెప్పేందుకు `అన్న వస్తున్నాడు`! ప్రజాక్షేత్రంలోనే టీడీపీ నాయకులను నిలదీసేందుకు `అన్న వస్తున్నాడు`!*. నిజమేనట... అనారోగ్యం కారణంగా తన పర్యటనను వాయిదా వేసుకున్న వైసీపీ అధినేత - ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి.. కాకినాడలో పర్యటించే అవకాశాలు లేవన్న వాదన వినిపిపించింది. అయితే ముందుగా అనుకున్న ప్రకారం కాకినాడలో ప్రచారం చేయాల్సిందేనని నిర్ణయించుకున్న జగన్... నేడు కాకినాడలో పర్యటించబోతున్నారు! శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి.. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఆయన తూర్పు గోదావరిలో అడుగుపెడుతున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.
ఆదివారం నుంచి ఆయన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నఅనంతరం ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జగన్ 26న (శనివారం) కాకినాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. కానీ అస్వస్థత కారణంగా ఆదివారానికి పోస్ట్ పోన్ చేశారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రెండు చోట్ల బహిరంగ సభలు, రోడ్డు షో నిర్వహించనున్నారని పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు వెల్లడించారు.
వైఎస్ జగన్ ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో కాకినాడ వస్తారు. ఉదయం 10.30 గంటలకు అన్నమ్మ ఘాటి వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత చంద్రిక థియేటర్ - జగన్నాథపురం వంతెన మీదుగా సినిమా రోడ్డులో రోడ్డు షోలో పాల్గొంటారు. మధ్యా హ్నం 2 గంటలకు డెయిరీ ఫారం సెంటర్ చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణమవుతారు. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల లానే.. టీడీపీ నేతలంతా కాకినాడలోనే మకాం వేసిన తెలిసిందే! ఈ తరుణంలో జగన్ పర్యటన.. టీడీపీ శ్రేణుల్లో కొంత అలజడి సృష్టిస్తుందనడంలో సందేహం లేదు.