Begin typing your search above and press return to search.

కొత్త ఏడాది లో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం !

By:  Tupaki Desk   |   31 Dec 2019 12:49 PM GMT
కొత్త ఏడాది లో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం !
X
సీఎం జగన్ మోహన్ రెడ్డి ..ఆంధ్రప్రదేశ్ అభివృద్దే ద్యేయంగా - నిరంతరం ప్రజల కోసం - ప్రజల మంచి కోసం ఆలోచిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తున్నారు, ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలే అయినప్పటికీ కూడా ఇప్పటికే ఎన్నో సంచలనమైన నిర్ణయాలతో పాలనని సాగిస్తున్నారు. ఇక అలాగే కొత్తగా స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ స్పందనపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అమ్మ ఒడి - రైతు భరోసా - ఇళ్ల పట్టాల పంపిణి వంటి కీలక పథకాలు లబ్దిదారులకు ఖచ్చితంగా చేరాలని సీఎం ఆదేశించారు. ఈ సమయంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నూతన సంవత్సరంలో జనవరి 1న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అవుతుందని - కొత్త ఏడాదిలో ప్రభుత్వం చేపట్టబోయే తొలి కార్యక్రమం అని తెలిపారు.

మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు - ఎస్పీలతో స్పందనపై అధికారులు నిర్దేశం చేశారు. కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. కొత్తగా 2059 రోగాలకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఫిబ్రవరి మాసం చివరి నాటికి 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయాలనీ సంబంధిత అధికారులకి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు జనవరి 3న పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించి - 2059 రోగాలకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాలి. మిగతా జిల్లాల్లో 1259 రోగాలకు ఆరోగ్య శ్రీ సేవలు పెంచాలి అని చెప్పారు. ఆ తరువాత ఏప్రిల్‌ నుంచి ఒక్కో జిల్లాకు పెంచుతూ అన్ని జిల్లాలో ఆరోగ్య శ్రీ సేవలు 2059 రోగాలకు పెంచాలని అధికారులకి ఆదేశాలు జారీచేశారు.

కొత్తరేషన్‌ కార్డులు - కొత్త పెన్షన్లు ఫిబ్రవరి 1 నుంచి పంపిణీ చేయాలి అని తెలిపారు. కొత్తగా అర్హులైన వారి జాబితాలను వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి అని - ఆరోగ్య శ్రీ - అమ్మ ఒడికి సంబంధించి అర్హుల జాబితాలను ఇప్పటికే గ్రామ - వార్డు సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం డిస్‌ ప్లే చేస్తున్నాం. అధికారులు అర్హతలను కూడా గ్రామ - వార్డు సచివాలయాల్లో డిస్‌ ప్లే చేయండి అని చెప్పారు. రైతు భరోసా - అమ్మ ఒడి - ఇళ్లపట్టాలు - రేషన్‌ కార్డులు - పెన్షన్లు సహా పథకాలకు సంబంధించి అర్హతలను - జాబితాలను గ్రామ - వార్డు సచివాలయాల్లో సంక్రాంతి నాటికి ప్రదర్శించాలి ఆదేశాలు ఇచ్చారు. జనవరి 9న అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభమవుతుంది అని తెలిపారు.

అలాగే , 2014 నుంచి 2019 జూన్‌ వరకూ మొత్తం 566 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని , 2014 నుంచి ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ఎలాంటి సహాయం అందించని రైతుల కుటుంబాలను పిలిపించి రూ.5 లక్షల చొప్పున ఫిబ్రవరి 12న వారికి పంపిణీ చేయాలి అని తెలిపారు. అలాగే ఫిబ్రవరి 1న రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని - వ్యవసాయరంగంలో సమూల మార్పులు సిద్ధిస్థాయి నాణ్యతతో కూడిన ఎరువులు - పురుగు మందులు - విత్తనాలు ఈ కేంద్రాల ద్వారా రైతులకి అందివ్వాలని తెలిపారు. ఉత్తమ సాగు యాజమాన్య పద్ధతులు రైతులకు అందుబాటులోకి తీసుకురావడంలో ఈ రైతు భరోసా కేంద్రాలు కీలకంగా వ్యవహరిస్తాయి అని తెలిపారు.