Begin typing your search above and press return to search.

అంబులెన్స్ వ‌చ్చింది!... జ‌గ‌న్ ఆగిపోయారు!

By:  Tupaki Desk   |   2 Jun 2019 9:38 AM GMT
అంబులెన్స్ వ‌చ్చింది!... జ‌గ‌న్ ఆగిపోయారు!
X
కుయ్యి కుయ్యి మంటూ వాహ‌నం వ‌స్తోందంటే... ఆ సౌండ్ చెవిలో ప‌డ‌గానే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆగిపోతారంతే. నిజ‌మా? అంటే... అందులో డౌటే లేద‌ని చెప్పాలి. ఇప్ప‌టిటికి ఎన్ని సార్లు చూడ‌లేదు? అంబులెన్స్ శ‌బ్ధం విన్నంత‌నే జ‌గ‌న్ ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోతారు. ప్ర‌సంగం అయినా, ప్ర‌యాణం అయినా... అంబులెన్స్ క‌నిపించిందంటే.. జ‌గ‌న్ ఆగిపోతారు. నిజ‌మే. ఈ మాట‌ను మ‌రోమారు నిజం చేస్తూ జ‌గ‌న్‌... నిన్న రాజ్ భ‌వ‌న్ లో ఇఫ్తార్ విందును ముగించుకుని వెళుతున్న జ‌గ‌న్‌... రోడ్డుపై అంబులెన్స్ సౌండ్ విని - ట్రాఫిక్ పోలీసుల‌కు చెప్పి మ‌రీ... ఆ అంబులెన్స్ వెళ్లే దాకా ఆగి మ‌రీ వెళ్లారు. అంబులెన్స్ కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌నీయొద్ద‌న్న త‌న వైఖ‌రిని జ‌గ‌న్ నిన్న మ‌రోమారు రుజువు చేశార‌న్న మాట‌.

అస‌లేం జ‌రిగిందంటే... రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకుని తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఇఫ్తార్ విందు ఇచ్చారు క‌దా. ఈ విందుకు తెలుగు రాష్ట్రా సీఎంల హోదాలో కేసీఆర్ - జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. చాలా సుహృద్భావ వాతావ‌ర‌ణంలో జ‌రిగిన ఈ విందు ముగియ‌గానే... వ‌చ్చిన వాళ్లంతా వెళ్లిపోతున్నారు. ఈ క్ర‌మంలో జగ‌న్ కూడా రాజ్ భవ‌న్ నుంచి బ‌య‌లుదేరారు. గేటు వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి... రాజ్ భ‌వ‌న్ రోడ్డుపై కుయ్యి కుయ్యి మంటూ ఓ అంబులెన్స్ ఖైర‌తాబాద్ వైపు వెళుతోంది. అయితే జ‌గ‌న్ వెళుతున్న నేప‌థ్యంలో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్‌ను పోలీసులు నిలిపేశారు. అయితే జ‌గ‌న్ రాజ్ భ‌వ‌న్ గేటు వ‌ద్దే త‌న కాన్వాయ్ ను ఆపేశారు. దీంతో విష‌యాన్ని గ్ర‌హించిన పోలీసులు అంబులెన్స్‌కు రూట్ క్లియ‌ర్ చేశారు. అంబులెన్స్ ఖైర‌తాబాద్ సిగ్న‌ల్స్ దాటిన త‌ర్వాత జ‌గ‌న్ కాన్వాయ్ చిన్న‌గా రాజ్ భ‌వ‌న్ నుంచి బ‌య‌లుదేరింది.

అంబులెన్స్ లో చికిత్స కోసం అత్య‌వ‌స‌రంగా ఆసుప‌త్రికి వెళుతున్న వారు ఉంటారు. దీంతో అంబులెన్స్‌ కు త‌న కార‌ణంగా బ్రేకులు ప‌డొద్ద‌న్న భావ‌న‌తో జ‌గ‌న్ ఎప్పుడు అంబులెన్స్ క‌నిపించినా ఆగిపోతారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో తాను మాట్లాడుతుండ‌గా అటుగా వ‌చ్చిన అంబులెన్స్ ను చూసిన జ‌గ‌న్‌.. త‌న ప్ర‌సంగాన్ని ఆపి మ‌రీ అంబులెన్స్ కు దారి ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేశారు. అంతేనా... త‌న ప్ర‌సంగాన్ని వినేందుకు త‌ర‌లివ‌చ్చిన జ‌న‌సందోహానికి విజ్ఞ‌ప్తి చేసి మ‌రీ అంబులెన్స్‌ కు దారి ఇప్పించారు. త‌న తండ్రి - దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన 108 అంబులెన్స్ లు ల‌క్ష‌ల కొల‌ది ప్రాణాల‌ను కాపాడిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అంబులెన్స్ ల పట్ల జ‌గ‌న్ చాలా సానుకూల దృక్ప‌థంతో ఉంటారు. విప‌క్ష నేత‌గా ఉన్నా, సీఎంగా ఉన్నా అంబులెన్స్‌ కు దారి ఇచ్చే విష‌యంలో మాత్రం జ‌గ‌న్ త‌న వైఖ‌రిని ఎంత‌మాత్రం మార్చుకోలేద‌న్న మాట‌.