Begin typing your search above and press return to search.
సెలెక్ట్ కమిటీకి ఆ మూడు పార్టీల పేర్లు..జగన్ వ్యూహమేంటో?
By: Tupaki Desk | 3 Feb 2020 4:30 PM GMTఏపీకి మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ అధికార వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ శాసనమండలి చైర్మన్ మహ్మద్ షరీప్ తీసుకున్న నిర్ణయం దాదాపుగా అమల్లోకి వచ్చేసినట్టే. చైర్మన్ ఆదేశాల మేరకు కమిటీలో ఉండబోయే సభ్యుల పేర్లను పంపాలంటూ మండలి సెక్రటేరియట్ పంపిన లేఖలకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు మండలిలో ఏడుగురు సభ్యులను కలిగిన కీలక పార్టీ పీడీఎఫ్. ఇద్దరు సభ్యులున్న బీజేపీ తమ పార్టీలకు చెందిన సభ్యుల పేర్లను పంపుతూ లేఖలు రాశాయి. ఇక వైసీపీ నుంచి సభ్యుల పేర్లను సూచిస్తూ లేఖ రావడమే తరువాయిగా మారిందన్న వాదన వినిపిస్తోంది. దీంతో సెలెక్ట్ కమిటీలకు సభ్యులను ప్రతిపాదిస్తూ జగన్ లేఖ ఇస్తారా? లేదంటే.. తాము చెబుతున్నట్లుగా సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపే అధికారం చైర్మన్ కు లేదంటూ చేస్తున్న వాదన మేరకే మిన్నకుండిపోతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మండలి సెక్రటేరియట్ పంపిన లేఖలకు ఇదివరకే సెలెక్ట్ కమిటీలో తమ సభ్యులు ఎవరెవరు ఉంటారన్న విషయాన్ని తెలుపుతూ టీడీపీ లేఖ అందజేసింది. తాజాగా పీడీఎప్ కూడా లేఖ రాస్తూ రెండు సెలెక్ట్ కమిటీల్లో ఒక్కరేసి సభ్యుల చొప్పున పేర్లను ప్రతిపాదిస్తూ లేఖ రాసింది. ఈ ఇద్దరిలో ఒకరు కేఎస్ లక్ష్మణ రావు కాగా, మరొకరు ఇళ్ల వెంకటేశ్వరరావు. అదే సమయంలో బీజేపీ కూడా సెలెక్ట్ కమిటీలో తమ పార్టీకి చెందిన మాధవ్ - సోము వీర్రాజులు చేరో కమిటీలో సభ్యులుగా ఉంటారని లేఖ రాసింది. అంటే... వైసీపీ నుంచి లేఖ అందిన వెంటనే సెలెక్ట్ కమిటీలు తమ పని ప్రారంభిస్తాయన్న మాట.
మరి మిగిలిన మూడు పార్టీల మాదిరిగా వైసీపీ కూడా సెలెక్ట్ కమిటీలకు తమ సభ్యుల పేర్లను ప్రతిపాదిస్తుందా? లేదా? అన్నదే ఆసక్తికరంగా మారింది. శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ సర్కారు అసెంబ్లీలో బిల్లును పెట్టి దానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే మండలి రద్దు కేవలం అసెంబ్లీ తీర్మానంతోనే పూర్తి కాదు. దానికి పార్లమెంటు ఆమోదం కూడా తప్పనిసరే. పార్లమెంటు ఎప్పుడు దీనిపై నిర్ణయం తీసుకుంటున్న విషయంపై ఇప్పటిదాకా క్లారిటీ లేదు. ఈ క్రమంలో పార్లమెంటు ఆమోద ముద్ర వేసేదాకా... మండలి రద్దు కాదు. ఇలాంటి నేపథ్యంలో సెలెక్ట్ కమిటీలను కూడా వైసీపీ సర్కారు అడ్డుకునే అవకాశాలు లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ వాదనలకు తలొగ్గి జగన్ సెలక్ట్ కమిటీలకు సభ్యులను ప్రతిపాదిస్తారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. మనుగడలోనే ఉన్న మండలి కమిటీలైన సెలెక్ట్ కమిటీలకు సభ్యులను ప్రతిపాదించకుండా ఉండలేని పరిస్థితిలో వైసీపీ పడిపోయిందన్న వాదన వినిపిస్తోంది. ఈ వాదనను పట్టించుకోకుండా జగన్ వ్యవహరిస్తే... ఆయనతో పాటు వైసీపీ కూడా ఇబ్బందికర వాతావరణమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.