Begin typing your search above and press return to search.
గంటాను అవంతికి వదిలేసిన జగన్
By: Tupaki Desk | 12 March 2020 10:10 AM GMTస్థానిక ఎన్నికల వేళ కార్య నిర్వాహక రాజధానిగా పేర్కొన్న విశాఖపట్టణం జిల్లాలో పార్టీ సత్తా చాటేలా జగన్ వ్యూహం రచించాడు. ఎందుకంటే అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తీసుకురావడంతో స్థానిక ఎన్నికల్లో భారీ స్థాయిలో లబ్ధి పొందాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసిందంట. అయితే విశాఖపట్టణంలో ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఉన్నాడు. అతడిని నియంత్రణలో పెట్టడానికి, పార్టీ భారీ స్థాయిలో స్థానాలు గెలిచే బాధ్యతను మంత్రి అవంతి శ్రీనివాస్ కు అప్పగించారని సమాచారం.
ప్రస్తుతం గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికలు కూడా వచ్చాయి. పట్టణ ప్రాంతం కావడంతో మొత్తం బాధ్యతంతా మంత్రి అవంతికి అప్పగించేశారు. రాజధానిగా ఎంపిక చేయడంతో ఫలితాలు మనకే మద్దతుగా వస్తాయని భావిస్తున్నా గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉండడంతో కొంత ప్రభావం ఉంటుందని.. నువ్వు చూస్కో అని జగన్ మంత్రి అవంతికి ఆదేశించారంట. అవంతి, గంటా ఇద్దరిది గురుశిష్యుల బంధమని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో గంటాకు చెక్ పెట్టాలంటే అవంతినే కరెక్టని ఆ మేరకు జగన్ ఆదేశాలు జారీ చేశారంట. రాజధానిగా మారడంతో జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని భావించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ చేయడానికి
ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. దీంతో టికెట్ల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో కార్పొరేషన్ టికెట్ల లొల్లి మొదలైంది. పార్టీని నమ్ముకున్నవారికి టికెట్లు ఇవ్వలేదంటూ కొందరు ఆందోళన చేస్తుండగా వారినందరినీ సర్దుబాటు చేస్తూ ఎలాగైనా పార్టీ మున్సిపల్ పీఠంపై జెండా ఎగురవేయాలనే ధ్యేయంతో అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనకు తోడుగా విశాఖపట్టణంలోనే కొన్నాళ్లుగా తిష్టవేసిన పార్టీ రాజ్యసభ సభ్యుడు, జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న విజయసాయి రెడ్డి ఉన్నారు. విజయసాయి రెడ్డి సూచనలను తీసుకుని మంత్రి అవంతి శ్రీనివాస్ జీవీఎంసీ ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ మేరకు విశాఖ కార్పొరేషన్ ఎన్నికలకు తొలి విడతలో 48 మందితో గురువారం అభ్యర్థుల జాబితాను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు.
దీనిపై కొన్ని నిరసనలు వచ్చినా మంత్రి బుజ్జగించారు. 3 ఏజెన్సీల ద్వారా సర్వేలు చేసి అభ్యర్థుల్ని ఖరారు చేశామని.. ఇక దీనిని మార్చే ప్రసక్తే లేదని మంత్రి అవంతి స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించాలని, టికెట్లు రాని వారికి భవిష్యత్ లో అవకాశం ఇస్తామని సర్దుబాటు చేస్తున్నారు. అందరినీ నియంత్రిస్తూ ప్రతిపక్షాన్ని తీవ్రంగా దెబ్బతీసేలా మంత్రి పకడ్బందీ వ్యూహం నడిపిస్తున్నాడు. ఇక దీని దెబ్బకు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాస్ ఎదుర్కొలేకపోతున్నాడు. ముందే అస్త్రసన్యాసం చేసినట్టు కనిపిస్తోంది. పోటీలో లేకుండా ఉండేట్టు పరిణామాలు ఉన్నాయి. దీంతో జగన్ వేసిన మంత్రి అవంతి అస్త్రం బాగా పని చేస్తోందని తెలుస్తోంది. దీని పర్యవసానం జీవీఎంసీ ఎన్నికల్లో తేలనుంది.