Begin typing your search above and press return to search.
జగన్ కు థ్యాంక్స్ చెప్తున్న జంపింగ్ ఎమ్మెల్యేలు
By: Tupaki Desk | 10 July 2016 8:09 AM GMTవైసీపీ అధినేత అనుభవరాహిత్యాన్ని అధికార టీడీపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోందా? అసెంబ్లీలో అవిశ్వాసం మొదలు… ఎమ్మెల్యేల ఆనర్హత వరకు వైసీపీ వేస్తున్న తప్పటడుగులు అధికార పార్టీకి కలిసి వస్తున్నాయా?… అధికార టీడీపీ అనుసరిస్తున్న వ్యూహాలతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?.. జగన్ ఇలాగే వ్యవహారిస్తే పార్టీకి భవిష్యత్తులోనూ ఇబ్బందులు తప్పవా… వైసీపీ నేతలను ప్రస్తుతం ఈ ప్రశ్నలు వేధిస్తున్నాయి.
వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల‌్లో ఇరవై మంది ఇప్పటి వరకు అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచి సైకిల్ ఎక్కిన ఎమ్మెల్యేలను పదవుల నుంచి తప్పించేందుకు ప్రతిపక్ష నేత జగన్ అనేక వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కు ఫిర్యాదులు చేయడంతో పాటు న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. అయితే తాజాగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకి సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయం - సుప్రీంకోర్టు తీర్పుతో వైసీపీ నేతలు షాక్ తిన్నారు. మొదటగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. అయితే వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్ లు నిబంధనలకు అనుగుణంగా లేవంటూ స్పీకర్ వాటిని తిరస్కరించారు. దీంతో వైసీపీ అనుభవ రాహిత్యం మరోసారి బహిర్గతమైంది.
గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు కోసం ప్రభుత్వంతో పాటు - స్పీకర్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. మొదటగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలకి విప్ ఇవ్వడంలో జాప్యం చేసింది. మరోవైపు శాసనసభ అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీలు ప్రకటించడంతో విప్ ఇచ్చేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకి ఇబ్బంది లేకుండా అధికార పార్టీ వేసిన ఎత్తుగడ ఫలిచింది. దీంతో మరుసటి రోజు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చి పార్టీ మారిన ఎమ్మెల్యేలని ఇరుకున పెట్టాలని వైసీపీ ఎత్తుగడ వేసింది. దీంతో స్పీకర్ ఇచ్చిన అవిశ్వాసంపై అదే రోజు చర్చకి అనుమతించడంతో మరోసారి వైసీపీ… అధికార టీడీపీ వ్యూహం ముందు బొక్కబోర్లా పడింది.
ఈ సంఘటనల తర్వాత కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో వైసీపీ జాగ్రత్తగా వ్యవహరించలేకపోయింది. అనర్హత ఫిటిషన్ల విషయంలోనూ వైసీపీ సరైన పద్ధతి పాటించకపోవడం, ఫిరాయింపు ఎమ్మెల్యేలకి కలసి వచ్చిందంటున్నారు. అధికార పార్టీని రాజకీయంగా - సాంకేతికంగా జగన్ ఎదుర్కోలేక పోతున్నారని ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ల సలహా తీసుకోకపోవడం, జగన్ కి అంతగా అనుభవం లేకపోవడంతో అధికార టీడీపీకి మేలు చేస్తుందని వైసీపీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఇప్పటికైనా జగన్ తన వ్యూహాలకి పదునుపెట్టకపోతే భవిష్యత్ లో పార్టీకి మరింత నష్టం తప్పదని వైసీపీ నేతలు అంటున్నారు.