Begin typing your search above and press return to search.
ఏపీ పిల్లల ఫ్యూచర్ మారే నిర్ణయం తీసుకున్న జగన్
By: Tupaki Desk | 6 Nov 2019 8:53 AM GMTకొందరు అదే పనిగా మాటలు చెబుతుంటారు. మరికొందరు అందుకు భిన్నంగా చేయాల్సిన పనిని చేతల్లో చేసి చూపిస్తుంటారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోకోవకు చెందినవారు. నోట్లో నుంచి మాట వచ్చింది మొదలు.. తాను ఇచ్చిన మాటను ఎలా పూర్తి చేయాలన్న ఆలోచనలోనే ఉంటారు. అందుకు నిదర్శనంగా తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని చెప్పక తప్పదు.
మారుతున్న కాలానికి తగ్గట్లు.. పరిస్థితులకు తీసిపోనట్లు.. ప్రపంచంతో పోటీ పడేందుకు వీలుగా పిల్లల్ని తయారు చేసేందుకు వీలుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు విప్లవాత్మక మార్పులకు కారణమవుతుందని చెప్పక తప్పదు. వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి మొదలు ఎనిమిదో తరగతి వరకూ సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిషులోనే పాఠాలు చెప్పాలని డిసైడ్ చేశారు.
అంటే.. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ స్కూళ్లలో చదువులన్ని ఇంగ్లిషు మీడియంలోనే ఉండనున్నాయి. ఇప్పటివరకూ తెలుగులో ఉన్న పాఠాలు ఇంగ్లిషులోకి మారనున్నాయి. అంతేకాదు.. తెలుగు కేవలం ఒక సబ్జెక్ట్ గా ఉంటుందే తప్పించి.. మిగిలిన ఏ పాఠ్యాంశం కూడా తెలుగులో ఉండదు. తర్వాతి ఏడాది నుంచి తొమ్మిది.. పదో తరగతి కూడా ఇంగ్లిషులోనే బోధిస్తారు.
పిల్లలకు ఇంగ్లిషులో పాఠాలు చెప్పాలంటే టీచర్లకు అందుకు తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. రానున్న వేసవిలో స్కూలు టీచర్లకు.. ఉపాధ్యాయులకు ఇంగ్లిషులో భోదనా పద్దతులపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంతేకాదు.. విద్యా సంవత్సరానికి ముందే పుస్తకాలు అందించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో రానున్న రోజుల్లో సర్కారీ స్కూళ్లలో చదివే పిల్లలంతా ఇంగ్లిషు మీడియంలోనే చదివే వీలుంటుంది. పేద వర్గాల పిల్లల ఫ్యూచర్ మారేలా సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పక తప్పదు. కాన్వెంటు.. కార్పొరేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు మాత్రమే సాధ్యమయ్యే ఇంగ్లిషు మీడియం చదువు.. ఇస్కూల్ కు కూడా వచ్చేయనుంది. ఇదో విప్లవాత్మకమైన మార్పుగా చెప్పక తప్పదు.