Begin typing your search above and press return to search.
జగన్ సంచలనం: పేదలకు అమరావతి భూములు
By: Tupaki Desk | 25 Feb 2020 11:00 AM GMTగద్దెనెక్కినప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న సీఎం వైఎస్ జగన్ మరో పెను విప్లవాన్ని తీసుకొచ్చారు. అమరావతి పేరిట చంద్రబాబు పేద రైతులనుంచి లాక్కున్న భూములను అదే ఇళ్లు లేని పేదలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జగన్ సర్కారు మంగళవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా సీఎం జగన్ కృష్ణా - గుంటూరు జిల్లాల్లో అర్హులైన పేదలకు రాజధాని అమరావతి ప్రాంతంలో ఖాళీగా ఉన్న భూములను ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి - పెదకాకాని - మంగళగిరి - దుగ్గిరాల తో పాటు విజయవాడ నగర పరిధిలో లోని అర్హులకు అమరావతి పేరిట చంద్రబాబు తీసుకున్న సిఆర్డీయే పరిధిలోని స్థలాలు కేటాయించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ రెండు జిల్లాలోని అర్హులైన మొత్తం 54,307 మందికి 1251.5 ఎకరాలు ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ మేరకు లెక్క తేల్చింది. లబ్ధిదారులకు నౌలురు - కృష్ణాయపలెం, -నిడమర్రు - ఐనవోలు - కురగల్లు - మందడం లో భూములు కేటాయిస్తూ జగన్ సర్కారు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు చేసిన భూపందేరానికి చెక్ పడింది. పేదలకు ఇళ్ల స్తలాలు ఇచ్చి జగన్ నిరుపేదలకు న్యాయం చేసినట్టు అయ్యింది.